Summer Cooling Plants: ఈ మొక్కలు ఇంటికి చల్లదనాన్ని అందిస్తాయి..

Sun, 21 Apr 2024-6:41 pm,

జాస్మిన్ ఈ మొక్క ఎంతో పరిమళభరితంగా ఉంటుంది. ఈ మొక్క మన భారతదేశంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ పూల మొక్క పెంచుకుంటే మీ ఇంటి గార్డెన్ తో పాటు ఇంట్లో కూడా పరిసర ప్రాంతాలు పరిమళభరితంగా మారిపోతాయి జాస్మీన్ ఇంట్లోని వేడిని గ్రహిస్తుంది రూమ్ టెంపరేచర్ను తగ్గిస్తుంది ఇది మంచి ఇండోర్ ప్లాంట్ ఇంటి పరిసర ప్రాంతాలను చల్లబరిచి గాలిని కూడా శుభ్రపరిచే శక్తి జాస్మిన్ మొక్కకు ఉంది.  

మందార మొక్క.. మందార మొక్కను పూజలో కూడా ఉపయోగిస్తారు ఇది కాళీమాతకి దుర్గామాతకి ఎంతో ఇష్టం ఇది మలవైసీ జాతికి చెందిన మొక్క పెద్దగా నిర్వహణ అవసరం ఉండదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకుంటే పరిసర ప్రాంతాలను చల్లబరిచి గాలిని ప్యూరిఫై చేస్తుంది అనారోగ్యంతో ఉండే మొక్కలు అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఈ మొక్క నుంచి గాలిని పీల్చుకుంటే త్వరగా రికవరీ అవుతారు.

జెరెనియం.. ఈ మొక్క కూడా రూమ్ టెంపరేచర్ను తగ్గిస్తుంది ఎక్కువ అధిక ఉష్ణోగ్రత ఉండే దేశాల్లో దీని ఎక్కువగా ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పువ్వుకు ఐదు రెక్కలు ఉండి తెలుపు పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది ఇది మంచి ఇండోర్ ప్లాంట్ ఇది సంవత్సరం అంతా పూలు పూస్తాయి.

లావెండర్... లావెండర్ మొక్క మంచి ఇండోర్ ప్లాంట్ దీంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి నిద్రలేమికి యాంగ్సైటికి స్ట్రెస్ నుంచి కూడా రిలీవ్ చేస్తుంది లావెండర్ మొక్క ఈ మొక్కను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటే ఇంటికి చల్లదనాన్ని ఇస్తుంది.

పీస్ లిల్లీ.. ఈ మొక్క కూడా మంచి ఇండోర్ ప్లాన్ చూడటానికి ఆహ్లాదకరంగా తెలుపు పువ్వులతో కనిపించే ఈ మొక్క ప్రాంతాల్లో పెంచుకుంటే గాలిని శుభ్రం చేసి చల్లదనాన్ని అందిస్తుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link