Rose Day 2024: ఈ ఐదు రకాల గులాబీలకు అర్థం తెలుసా.. ఆ ఫ్లవర్ ఇస్తే మీ లవ్‌కు గ్రీన్ సిగ్నల్
ఫిబ్రవరి నెల్లలో వాలంటైన్స్ డే రోజును స్పెషల్ గా జరుపుకోవాలని ప్రేమికులు కోరుకుంటారు. అయితే కొంతమంది అనేక రకాల పువ్వులను వారి ప్రియురాలికి ఇస్తారు. అందులో ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీలు ఇస్తారు. ఈ ఎరుపు రంగు ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వు మీకు ఎవరైన ఇస్తే వారు తమను ప్రేమిస్తున్నరని తెలుసుకోండి.
సాధారణంగా తెలుపును శాంతికి చిహ్నంగా భావిస్తాము. అయితే ఈ పువ్వు అనేది మనం ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే, మీరు రోజ్ డే రోజున వారికి ఈ ఫ్లవర్ ఇవ్వవచ్చు.
పింక్ రోజ్‌ను చాలా మంది ఇష్టపడుతారు. ఇది బెస్ట్ ఫ్రెండ్ కి తమ స్నేహం అప్పటికి బాగుండాలని కోరుకుంటూ ఇస్తారు.
నీలం గులాబీ అరుదైనవి. మీకు నీలం గులాబీ పువ్వును ఎవరైన ఇస్తే దానికి అర్థం అరుదైనవారుని భావిస్తారు.
పసుపు రంగు గులాబీ అనేది ఆనందం, స్నేహన్నికి అర్థం అని చెబుతారు. ఈ పువ్వు ఇద్దరి మధ్య ఆనందాన్ని పెంపొందిస్తాని లవర్స్ నమ్మకం.