Romance Ministry: రష్యాలో కొత్త మంత్రిత్వ శాఖ.. శృ**ర శాఖకు మంత్రి, ప్రత్యేకమైన ఖజానా కూడా?
ఇటీవల మిర్రర్ అందించిన నివేదికల ప్రకారం.. రష్యాలో తగ్గుతున్న జననాల రేటును మెరుగుపరిచేందుకు శృంగార మంత్రిత్వ శాఖను అతి త్వరలోనే రూపొందించే అవకాశాలు ఉన్నాయట. రష్యా అధ్యక్షుడు పుతిన్ విధేయురాలు ఇప్పటికే కుటుంబ సంరక్షణ, మాతృత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతి పిటిషన్ వేసింది.
ఆమె వేసిన పిటిషన్ ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పందించి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా రెండు దేశాలకు ఎంతో ప్రాణ నష్టం జరిగింది. దీనికి తోడు జననాల రేటు కూడా విపరీతంగా తగ్గిపోయింది. అయితే రష్యాలో జననాల రేటును పెంచేందుకు పుతిన్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యాలో విపరీతంగా జననాల రేటు పడిపోవడంతో.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జనాభాను పెంచేందుకు ఈ శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ శాఖ ప్రధాన లక్ష్యం సంతానోత్పత్తిని దేశంలో విపరీతంగా పెంచేందుకు శృంగార కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమేనని కొన్ని నివేదికల్లో పేర్కొన్నారు.
శృంగార మంత్రిత్వ శాఖ అమల్లోకి వస్తే.. రష్యాలోని శృంగార కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రాత్రి పది గంటలకి ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ తిరిగి ఉదయం 3 గంటలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలాగే లైట్స్ను కూడా స్విచ్ ఆఫ్ చేయాలని ప్రభుత్వం సూచించిందట.
అంతేకాకుండా ఈ మంత్రిత్వ శాఖ అమల్లోకి వస్తే.. ఇంట్లో ఉండే ప్రతి తల్లికి వేతనం కూడా ప్రభుత్వం చెల్లించే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ఫస్ట్ డేట్ లో భాగంగా సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరికి రూ.5,000 అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పనులు చేసే సమయంలో విరామం దొరికితే సంతానోత్పత్తిలో పాల్గొనే అవకాశాలు కూడా ప్రభుత్వం కలిగించబోతోంది.