Battle Tanks: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ట్యాంకులు ఇవే..
పాశ్చాత్య దేశాల సహాయం తరువాత.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రష్యా వద్ద కూడా బలమైన యుద్ధ ట్యాంకులు ఉండడంతో ప్రత్యర్థికి ధీటుగా సమాధానం ఇవ్వనుంది. రష్యా వద్ద T-90, అర్మాటా వంటి ప్రమాదకరమైన ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇవి శత్రుశేషాన్ని నిమిషాల్లో నాశనం చేయగలవు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 5 ట్యాంకులు ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసుకుందాం..
యూఎస్ ఆర్మీ వద్ద భయంకరమైన యుద్ధ ట్యాంక్ M1A2 అబ్రమ్స్ ఉంది. దీనిని అమెరికన్ కంపెనీ జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఈ ట్యాంక్ 120 mm XM 256 స్మూత్‌బోర్ గన్‌తో అమర్చి ఉంటుంది. ఇది వివిధ రకాల షెల్‌లను కాల్చగలదు. సాయుధ వాహనాలు, పదాతిదళం, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలను కూడా ఈ ట్యాంక్‌తో లక్ష్యంగా చేసుకుని నాశనం చేయవచ్చు.
రష్యా సైన్యం T-14 అర్మాటా యుద్ధ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ట్యాంకులలో ఒకటి. ఈ ట్యాంక్‌ను రష్యన్ ఆయుధ కంపెనీ ఉరల్‌వాగోంజావోడ్ అభివృద్ధి చేసింది. ఇది సుమారు 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. రెండేళ్ల క్రితం రష్యన్ సైన్యంలోకి చేర్చారు. ఈ ట్యాంక్ 125 mm 2A82-1M స్మూత్‌బోర్ గన్‌తో అమర్చబడి.. సొంతంగా షెల్‌లను లోడ్ చేయగలదు. A-85-3A టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఈ ట్యాంక్‌లో ఉంటుంది. ఇది 90km/h గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఈ విమానం కాకుండా రష్యా వద్ద T-90తో సహా అనేక ప్రమాదకరమైన ట్యాంకులు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం మెర్కవా మార్క్ IV యుద్ధ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ట్యాంక్‌లలో ఒకటి. 2004లో ఇజ్రాయెల్ సైన్యంలోకి చేర్చుకుంది. మెర్కవా మార్క్ IV ట్యాంక్‌పై అమర్చిన 120 mm స్మూత్‌బోర్ గన్ హీట్, సబోట్ రౌండ్‌లతో పాటు LAHAT యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా కాల్చగలదు. ఇది కాకుండా ట్యాంక్‌లో ఆర్మర్ సైడ్ స్కర్ట్‌లు, నిర్దిష్ట ఖాళీ కవచం, ఇంటిగ్రేటెడ్ IMI స్మోక్-స్క్రీన్ గ్రెనేడ్‌లు, ఎల్బిట్ లేజర్ హెచ్చరిక వ్యవస్థ ఉన్నాయి.
VT4 ట్యాంక్‌ను చైనా నార్త్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (నోరింకో) అభివృద్ధి చేసింది. ఇది చైనా సైన్యం మూడో తరం ట్యాంక్. మొదటిసారిగా ఈ ట్యాంక్‌ను రాయల్ థాయ్ ఆర్మీ 2017లో ఉపయోగించింది. ఈ ట్యాంక్ గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. దాని పరిధి సుమారు 500 కిలోమీటర్లు. ట్యాంక్‌లో 125 mm స్మూత్‌బోర్ గన్ అమర్చారు. ఇది HEAT వార్‌హెడ్‌లు, APFSDS రౌండ్లు, ఫిరంగి, గైడెడ్ క్షిపణులను కాల్చగలదు. తాజాగా పాకిస్థాన్ కూడా వీటీ4 ట్యాంక్‌ను కొనుగోలు చేసింది.
GIAT ఇండస్ట్రీస్ రూపొందించిన లెక్లెర్క్ ట్యాంక్ మూడవ తరం ట్యాంక్. దీనిని ఫ్రెంచ్ సైన్యం కాకుండా యూఏఈ సైన్యం కూడా ఉపయోగిస్తుంది. ట్యాంక్ 40 రౌండ్ల 120 మిమీ మందుగుండు సామగ్రిని, దాదాపు 950 రౌండ్ల 12.7 మిమీ మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలదు. NATO-స్టాండర్డ్ CN120-26 120 mm స్మూత్‌బోర్ గన్, 12.7 mm మెషిన్ గన్, రూఫ్-మౌంటెడ్ 7.62 mm మెషిన్ గన్‌తో ఆయుధాలు కలిగి ఉంది.