SDT18: ఎస్‌వైజీతో వస్తున్న సాయి దుర్గా తేజ్.. కొత్త దర్శకుడితో రూ.100 కోట్ల బడ్జెట్
పదేళ్లు పూర్తి: మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి దుర్గాతేజ్ చిత్ర పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
18వ సినిమా: దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి దుర్గాతేజ్ తన 18వ సినిమాను ప్రారంభించాడు.
కొత్త కథాంశం: కొత్త దర్శకుడు కేపీ రోహిత్‌తో కలిసి 'సంబరాల ఏటి గట్టు' (ఎస్‌వైజీ) పేరుతో కొత్త సినిమాతో సాయి దుర్గా తేజ్ వచ్చాడు. తేజ్ పక్కన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది.
రామ్ చరణ్ రాక: హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా వేడుకకు రామ్ చరణ్ తేజ్ హాజరై చిత్రబృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపాడు.
కొత్త గెటప్: గతంలో ఎప్పుడూ చూడని గెటప్‌లో సాయి దుర్గా తేజ్‌ను కేపీ రోహిత్ చూపించబోతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి చెప్పవచ్చు.
భారీ బడ్జెట్: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా రూ.100 కోట్లతో ఈ చిత్ర నిర్మిస్తుండడం సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది.
పరిశ్రమలో చర్చ: కొత్త దర్శకుడు.. కొత్త నిర్మాతలు సాయి దుర్గా తేజ్‌పై రూ.వంద కోట్లు బడ్జెట్ పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.