Sai Pallavi: ఇంటి నుంచి బయటకు రాలేకపోయా.. నరకం చూసా.. సాయి పల్లవి ఊహించని కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తన ముఖం మీద మచ్చలతోనే అందరిని ఆకట్టుకుంది. ప్రేక్షకులను మెప్పించడానికి నటనా ప్రతిభ ఉంటే చాలని నిరూపించిన ఈ ముద్దుగుమ్మ, గ్లామర్ కి దూరంగా ఉంటూ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది.
ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఈ సినిమాకి ముందు తన లుక్స్ గురించి అభద్రతాభావంగా ఫీల్ అయినట్టు తెలిపింది. మేకప్ కి దూరంగా ఉంటూ.. సహజ సౌందర్యాన్ని ఆలింగనం చేసుకున్న ఈమె, ఒకప్పుడు తన లుక్స్ గురించి ఎంత బాధ పడిందో చెప్పుకొచ్చింది.
“ప్రేమమ్ సినిమా కంటే ముందు వందల రకాల క్రీములు ఉపయోగించాను. కానీ వాటి వల్ల మొటిమలు వచ్చాయి ఎంతో కష్టపడ్డాను. ఆ సమయంలో ఇంటిని వదిలి బయటకు వెళ్లాలనిపించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు నా మొటిమల గురించి చర్చించుకుంటారేమో అని అపోహలో ఉండేదాన్ని. అందుకే నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ మొటిమల కారణంగా నాలో కాన్ఫిడెంట్ కూడా పూర్తిగా కోల్పోయాను” అంటూ ఆమె తెలిపింది.
“అయితే ప్రేమమ్ సినిమా తర్వాత నా అన్ని లోపాలను ప్రజలు అంగీకరించడం చూసి, నాలోని ఫీలింగ్ మొత్తం మారిపోయింది. నా పాత్ర ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో అది మాత్రమే గమనించాను. వారు నాతో కనెక్ట్ అయిపోయారు. దానికి నేను సంతోషించాను,”అంటూ చెప్పుకొచ్చింది.
“అందుకే ఈ మొటిమలు ఉన్నా సరే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. ఇప్పుడు అదే మొటిమలు నన్ను ఇప్పుడు నేచురల్ బ్యూటీగా మార్చేశాయి,” అంటూ తెలిపింది సాయి పల్లవి.