Samakka Sarakka Earthquake: సమ్మక్క సారలమ్మలకు కోపం వచ్చిందా.. అందుకే భూకంపాలు.. ప్రకృతి వైపరీత్యాలు..
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వన దేవతలు కొలువైన సమ్మక్క సారలమ్మ విషయంలో ప్రజలు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరుస వైపరీత్యాలు సంభవిస్తున్నాయా.. అటవీ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ది పనుల కారణంగా ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం కారణంగా వరుస ఘటనలు జరగుతున్నాయనేది స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం.. ములుగు జిల్లాలో మేడారం వద్ద 5.3 మాగ్నిట్యూడ్ గా భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. అంతేకాదు సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రజలు, ప్రభుత్వం చేసిన కొన్ని చేయకూడని తప్పుల కారణంగా అమ్మవారికీ ఆగ్రహం తెప్పించినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే మేడారం లో ప్రకృతి ప్రకోపం చూపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే ప్రాంతంలో ఇప్పుడు భూమి కంపించింది. 2023 జూలైలో ములుగు భూపాలి పల్లిలో 55 సెం.మీ.. 60 సెం.మీ వర్షం పడింది. ఒక యేడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులో కురిసి ములుగు పరిసర ప్రాంతాల్లో అల్లోకల్లోలం సృష్టించింది. అప్పట్లో భారీ వర్షాలు పడటం.. ఆ తర్వాత చెట్లు కూలిపోవడానికి, భూమి కంపించడానికి గల సంబంధంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
రీసెంట్ గా మూడు నాలుగు నెలల క్రితం ములుగులో వచ్చిన సుడిగుండం మహా ప్రళయ భీకర రూపం దాల్చింది. గతంలో ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ పరిధిలో గత ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటలు మధ్యలో బలమైన గాలులతో భారీవర్షం కురిసింది. దీంతో కూకటివేళ్లతో సహా చెట్లు కూలిపోయాయి. 3 కిలోమీటర్ల పొడవు, అర కిలోమీటరు వెడల్పులో మొత్తం 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భారీనష్టం వాటిల్లింది. సుమారు కొన్ని లక్షల చెట్లు ఒక వైపు కూలిపోవడం ప్రకృతి ప్రేమికులను కలిచి వేసింది.
ఈ వరుస ఘటనలు చూస్తుంటే.. ప్రకృతి ప్రకోపించిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతలను గుర్తు చేస్తుంది. మరి ఈ విషయమై ప్రజలు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు.