Samantha Top Movies: 14 యేళ్ల కెరీర్‌లో సమంత కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..

Mon, 26 Feb 2024-12:00 pm,

ఏమాయ చేసావే..

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో సమంత హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

బృందావనం..

ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బృందావనం'. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తే.. సమంత సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

 

దూకుడు.. శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ 'దూకుడు'. ఈ సినిమాతో సమంత తొలి హాట్రిక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఈగ.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సమంత.. నాని సరసన నటించింది. ప్రేమికుడిని కోల్పోయిన యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..

వెంకటేష్, మహేష్ బాబు తొలిసారి కలిసిన నటించిన ఈ మూవీతో సమంత.. మహేష్ బాబు సరసన నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్‌గా నిలిచింది.

అత్తారింటికీ దారేది..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికీ దారేది' మూవీలో శశిగా ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

మనం..   ఇక అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యతో పాటు చివర్లో అఖిల్ హీరోలుగా నటించిన 'మనం' సినిమాలో ప్రియ పాత్రలో ఒదిగిపోయింది సమంత. ఈ సినిమా తర్వాత వారింటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.

జనతా గ్యారేజ్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

రంగస్థలం..

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మూవీ సమంత కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. వీటితో పాటు మజిలీ, ఓ బేబి, యశోదా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు తమిళంలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link