Samantha: తప్పు ఒప్పుకుంటున్నా.. ఇకనైనా వదిలేయండి.. సమంత షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత, అతి తక్కువ సమయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు యాడ్స్ చేస్తూ భారీ ఇమేజ్ అందుకున్న సమంత , టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది.
ఒక టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా విజయ్ తో పాటు మరి కొంతమంది హీరోలతో నటించిన సమంత.. కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత భర్తతో కలిసి మజిలీ అనే సినిమా చేసిన ఈమె.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు.
ఇకపోతే సమంత నాలుగేళ్ల పాటు వైవాహిక బంధంలో సంతోషంగా గడిపింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ప్రకటించారు. విడాకుల సమయంలో సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడే కొంతకాలం ఉన్న ఈమె మళ్లీ తిరిగి వచ్చి యశోద, శాకుంతలం, ఖుషీ వంటి సినిమాలు చేసి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఇప్పుడు మళ్లీ సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ తో సమంతకు మంచి ఇమేజ్ లభించింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా తప్పు ఒప్పుకున్నాను అంటూ సమంత చెప్పడం వైరల్ గా మారుతుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. సమంత మాట్లాడుతూ.. నేనెప్పుడూ కూడా మంచి పాత్రలే ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే గతంలో కొన్ని పాత్రలు తప్పుగా ఎంచుకోవడం జరిగింది. ఆ తప్పును నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడతాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.