Samantha: వాళ్ల ప్రేమను చూసి గుక్కపెట్టి ఏడ్చేసిన సమంత..?.. అసలు ట్విస్ట్ తెలిసి ఓయమ్మో.. అంటున్న నెటిజన్లు..!
సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారని చెప్పుకొవచ్చు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో పెడుతున్న పోస్టులు మాత్రం కాకరేపుతున్నాయని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా..సామ్..ఇటీవల తనకు బాధగా అన్పించిన.. సినిమాలు, వెబ్ స్టోరీస్ కు సంబంధించిన అనేక అంశాలు కూడా నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ ను పుష్పా2 మూవీ రిలీజ్ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అదే విధంగా అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టులో హజరు పర్చడం, రిమాండ్ విధించడం జరిగింది.
ఆ తర్వాత కోర్టు మధ్యంత బెయిల్ ఇవ్వడంతో, ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో అల్లుఅర్జున్ ఈ రోజు ఉదయం జైలు నుంచి విడులయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మొదట గీతా ఆర్ట్స్ తన కార్యాలయంకు వెళ్లారు.
అక్కడి నుంచి తన ఇంటికి చేరుకున్నారు. అప్పుడు.. అల్లుఅర్జున్ సతీమణి, వీరి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఎమోషనల్ గా హగ్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారంట.
ఈ నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిపై తాజాగా, సామ్ కూడా స్పందించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో చూడగానే సామ్ కూడా.. ఎంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది.నేను ఏడవట్లేదు..అంటునే..ఆ వీడియో పోస్ట్ చేసి.. లవ్ సింబల్ కూడా పెట్టినట్లు తెలుస్తొంది.
అయితే.. కొంత మంది ట్రోలర్స్ మాత్రం.. ఎప్పటిలాగే.. సామ్.. చైతు, శోభితల పెళ్లిని చూసి ఏడ్చిందని కూడా ట్రోల్స్ చేస్తున్నారంట. కానీ అసలు విషయం తెలియక కొందరు ఇది నిజమని నమ్ముతున్నారంట. కానీ ఆతర్వాత విషయం తెలిసి.. వామ్మో.. ఇదేంట్రా అని అనుకుంటున్నారంట.