Samantha: నాగచైతన్యాన్ని అర్థం చేసుకోలేకపోయినా సమంత.. అక్కినేని హీరో కీలక వ్యాఖ్యలు..!

Sun, 24 Nov 2024-12:45 pm,

సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అదే సినిమాలో హీరో గా నటించిన నాగచైతన్యను ప్రేమించి , 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఈ జంట నాలుగేళ్లకే 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారని అనుకున్న అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట. పెళ్లయిన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు.

ఇకపోతే విడిపోవడానికి అసలు కారణం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదిలా ఉండగా సమంత  ఒంటరిగా జీవిస్తూ కెరియర్ పైన ఫోకస్ పెట్టింది. కానీ నాగచైతన్య వ్యక్తిగత జీవితాన్ని కూడా లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం జరగగా.. డిసెంబర్లో వివాహం జరగబోతోంది.

ఇకపోతే తాజాగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. మా వివాహ వేడుక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. మా తాత గారి విగ్రహం ముందు పెళ్లి జరిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇక మా రెండు కుటుంబాలు ఈ వేడుక నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయ,” అంటూ నాగచైతన్య తెలిపారు. 

అలాగే శోభితతో కొత్త ప్రయాణాన్ని.. ప్రారంభించి, “కొత్త జీవితాన్ని కలిసి పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఆమెతో నేను చాలా లోతుగా కనెక్ట్ అయ్యాను. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. నాలో ఖాళీని పూర్తి చేసింది. మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది,” అంటూ తెలిపారు..

ఇకపోతే నాగచైతన్య ఈ కామెంట్లు చేయడంతో.. నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సమంత నిన్ను అర్థం చేసుకోలేకపోయిందా..? ఆమెతో జర్నీ నీకు వర్కౌట్ కాలేదా? ఈ అర్థాలు వచ్చేలా కామెంట్లు చేస్తున్నావ్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు సమంత అభిమానులు. మరి సమంత దీనిపై ఏదైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link