Samantha: అప్పుడే అలాంటి వారికి కౌంటర్ ఇవ్వొచ్చు... చైతు పెళ్లి వేళ ఇచ్చిపడేసిన సమంతా..?.. పోస్ట్ వైరల్..

Thu, 21 Nov 2024-9:31 pm,

సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య, శోభితల  ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి సమంత తరచుగా ట్రెండింగ్ లో ఉంటున్నారు.

కొన్నిసార్లు తన మూవీస్ లేదా ఏదైన కార్యక్రమంలో పాల్గొని వార్తలలో ఉంటే.. మరికొన్ని సార్లు వివాదాల పరంగా చర్చలలో ఉంటున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంతాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  

మరోవైపు చైతుతో విడాకుల తర్వాత సామ్.. మయోసైటిస్ వ్యాధితో బాధపడినట్లు తెలుస్తొంది.  కొన్నేళ్ల పాటు మూవీస్ కు సామ్ దూరమయ్యారు. ఈ క్రమంలో సామ్ సిటాడెల్ బన్నీతో మళ్లీ అభిమానుల ముందుకు వచ్చారు.

ఇదిలా ఉండగా.. సామ్ ను తరచుగా సోషల్ మీడియాలో పొస్టులు పెడుతు యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ పిక్స్ ను కూడా సామ్ తన అకౌంట్ లో పొస్ట్ చేశారు.

తాజాగా.. సమంతా పెట్టిన పోస్ట్ వార్తలలో నిలిచింది. దీనిలో సామ్.. ఒక పద్యం కూడా చెప్పినట్లు తెలుస్తొంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. వెనక్కుతగ్గకూడదని, బలమైన శక్తితో మళ్లీ ప్రయత్నించాలని చెప్పుకొచ్చారు. మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలనికూడా సామ్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది.

అంతే కాకుండా.. ఎవరైన మనల్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తే.. తిరిగి బలంగా వారికి అదే విధంగా తగిన సమాధానం చెప్పాలని కూడా సామ్.. సంచలనంగా పోస్ట్ పెట్టారు. చైతుకు పెళ్లికి కొద్దిరోజుల ముందు  సామ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అయితే ఈ పోస్ట్ చైతును ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా...ఇచ్చిపడేసిందని కొంత మంది నెటిజన్లు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link