Samantha: మేకప్ రూమ్ లో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు

Wed, 24 Apr 2024-6:50 pm,

గత కొద్ది రోజులుగా తన ఆరోగ్య పరిస్థితిని వల్ల సినిమాలలో తక్కువగా కనిపిస్తోంది సమంత‌. ఈ కారణం వలన అభిమానులు కొంచెం నిరాశకు గురవుతున్న కానీ తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో ఎల్లప్పుడూ వారిని అలరిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహిత్ షేర్ చేసిన సమంత ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో తెలుగు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ఫోటోలలో సమంత తన మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటూ కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు మరోసారి ప్రేమలో పడిపోతున్నారు.

కాగా సమంత చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి సినిమాలో ఆరాధ్య పాత్రలో కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుండి.

ఇక ఈ సినిమా విడుదల ఎన్నో రోజులు కావస్తున్న ఇంకా ఏ కొత్త తెలుగు సినిమాకి కూడా సమంత అంగీకారం తెలపలేదు. ఈ క్రమంలో సమంతా కొద్ది రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుందని అలానే హిందీ సినిమాలలో తన హవా చూపించాలని అనుకుందని రూమర్స్ కూడా వస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link