Samantha: అతన్ని ఎంతగానో మిస్ అవుతున్న సమంత.. అసలు విషయం అదే..!
సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో కష్టాలకు గురైన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్ లో విడాకులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఈ హీరోయిన్ కి తలెత్తాయి. దీంతో ఎన్నో రోజులపాటు ఈ నటి సినిమాలకు దూరంగా ఉండింది..
తన ఆరోగ్యం కొంచెం కుదుటపడుతూ ఉండగా.. సమంత మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుందో. హీరోయిన్ తో పాటు నిర్మాతగా కూడా మారి ఈ హీరోయిన్. సమంత నటిస్తూ ఉన్న మా ఇంటి బంగారం సినిమా ఆమె నిర్మాణ సంస్థలోనే తెరకెక్కనుంది.
మరోవైపు తెలుగు సినిమాల కన్నా ఈ హీరోయిన్ హిందీ వైపు మగ్గు చూపుతోంది అనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత 'సిటడెల్-హనీ బన్నీ' అని వెబ్ సిరీస్ లో కనిపించనుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ తో సమంత ప్రేమలో రూమర్స్ కూడా వచ్చాయి.
కాగా నాగచైతన్య శోభితని నిశ్శతార్థం చేసుకోగా.. సమంత కూడా త్వరలో రాజ్ తో తన నిశ్చితార్థం జరుపుకొనుంది అనే వార్తలకు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి సమంత ప్రమోషనల్ ఫొటోస్ అలా పెట్టే క్యాప్షన్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
'సిటడెల్-హనీ బన్నీ'లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. ఈ సిరీస్ షూటింగ్ ఈ పూర్తి చేసుకుని త్వరలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఇక ఈ సీరియస్ కి సంబంధించిన ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి వరుణ్ ధావన్ రాలేదు. దీంతో అతన్ని ఎంతగా మిస్ అవుతున్నట్టుగా సమంత పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు''మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్'' అనే క్యాప్షన్ పెట్టింది ఈ హీరోయిన్.