Samantha: స్టార్ హీరోల సినిమాలకు దూరంగా సమంత.. ఎందుకలా!

Tue, 16 Jul 2024-2:22 pm,

సినిమాలకి దూరంగా ఉన్న రోజులు ఉన్నాయేమో కానీ.. సమంత సోషల్ మీడియాకి మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా.. తరచూ ఇన్స్టాగ్రామ్ లో.. తన అభిమానులతో హెల్త్ అప్డేట్స్ పంచుకుంటూ ఉండేది ఈ హీరోయిన్..  

తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు ఇండస్ట్రీలలో వర్క్ చేసిన సమంతకు…తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. కొనసాగింది సమంత. ప్రస్తుతం కూడా సమంతకు తెలుగులో క్రేజ్ తగ్గలేదు.

ఈ మధ్యనే విజయ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి సినిమాలో కనిపించి.. మెప్పించింది. ఈ చిత్ర విజయానికి కారణం విజయ్ దేవరకొండ కన్నా.. ఎక్కువ సమంతనే అని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఇక త్వరలోనే మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరోపక్క సమంతకు హిందీ అవకాశాలు కూడా ఎక్కువగానే.. వస్తున్నాయి అని వినికిడి. అయితే సమంత చేతిలో ప్రస్తుతం తెలుగులో మాత్రం స్టార్ హీరోల సినిమాలు లేవు. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలనే ప్రిఫర్ చేస్తోంది సమంత. ఎందుకు కారణం తెలియకపోయినా.. అభిమానులు మాత్రం ఆమె చేస్తున్న ఎక్స్పరిమెంట్ ని అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమంత ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక మ్యాగజైన్ కోసం సమంత ఎర్ర డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు.. ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link