Samantha: నాగచైతన్య - శోభిత పెళ్లికి సమంతకు ప్రత్యేక ఆహ్వానం..!
అక్కినేని నాగచైతన్య , సమంత నుంచి విడిపోయిన తర్వాత మరుసటి ఏడాది అనగా 2022లో.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాలతో.. ప్రేమలో పడిన విషయంతెలిసిందే. వాస్తవానికి తెనాలికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో అవకాశాల కోసం వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని కూడా గెలుచుకుంది.
ఇక నాగచైతన్యతో ప్రేమలో.. పడిన ఈమె రహస్యంగా చట్టపట్టలేసుకొని తిరిగారు. ఈ విషయంపై అడిగిన ప్రతిసారి కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది అక్కినేని నాగార్జున ఆగస్టు 8వ తేదీన వీరి నిశ్చితార్థాన్ని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పూర్తి చేశారు. ఈ వివాహానికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి లక్ష్మీ ఫ్యామిలీ అలాగే శోభిత ధూళిపాల ఫ్యామిలీ కూడా విచ్చేశారు..
ఇక దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఒక జాతీయ మీడియా నాగార్జునను ప్రశ్నించగా ఇంకా సమయం పడుతుంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా అప్పుడే నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది . శోభిత విశాఖపట్నంలోని తన ఇంట్లో గోధుమ రాయి, పసుపు దంచడం లాంటి పనులు మొదలయ్యాయి అని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్… అంచు కలిగిన చీర ధరించి చాలా చూడముచ్చటగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చీరను కాబోయే అత్త, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి బహుమతిగా పంపించిందని సమాచారం.ఇకపోతే పసుపు దంచడం కార్యక్రమం మొదలుపెట్టారంటే ఇక పెళ్లి పనులు దాదాపు మొదలైనట్టే. ఇక నవంబర్ 8వ తేదీన వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా నాగచైతన్య, శోభితల పెళ్లికి సమంతను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత అంటే ఇక్కడ నాగచైతన్య మాజీ భార్య అనుకోవడం పప్పులో కాలేసినట్టే. సమంత ఎవరో కాదు శోభితకు స్వయానా సోదరి. ఆమెను ప్రత్యేకంగా నాగచైతన్య శోభిత ఇద్దరు దగ్గరుండి మరీ ఈ పెళ్లి వేడుకలకు ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.