Samantha: ఈసారి కూడా బోల్డ్ గా కనిపించనున్న సమంత.. కంగారుపడుతున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. గత కొంతకాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇవాళ విడుదల ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో.. సిటాడిల్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా.. ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది.
తాజాగా ముంబైలో నిర్వహించిన ఒక ఈవెంట్లో ఈ వెబ్ సిరీస్ టీజర్ తో పాటు నవంబర్ 7న విడుదల అవుతుంది అంటూ.. విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో వరుణ్ ధావన్ సమంత ఇద్దరూ చేసిన స్టంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఇందులో చాలానే బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
గతంలో ఊ అంటావా ఉ ఊ అంటావా అంటూ ఐటమ్ పాటలో నటించిన సమంత మీద.. భారీ రేంజ్ లో ట్రోలింగ్ వచ్చింది. అంతేకాకుండా ఇంతకుముందు హిందీలో నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కూడా.. ఆమె బోల్డ్ సీన్స్ లో నటించింది. వాటి మీద కూడా ఫాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ ఈ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తే.. ఆమె కెరియర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందోనని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే.. ఈ వెబ్ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించారు.