Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!

Fri, 06 Dec 2024-8:52 pm,

ఇటీవల చైతు, శోభితల పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా చాలా మంది తరచుగా సామ్ తన ఇన్ స్టాలో పెట్టే పోస్టులు ఇన్ డైరెక్ట్ గా మాజీ భర్తను టార్గెట్ గా చేసుకుని పెట్టినవని అంటూ తెగ ట్రోల్ చేసినట్లు తెలుస్తొంది.  

ఈ నేపథ్యంలో ఇటీవల సామ్ తండ్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆమె మాత్రం చాలా బాధతో , ఎమోషనల్ గా ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల సామ్ పెళ్లి తర్వాత.. సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ టీమ్ తో జర్నీ గురించి ఇన్ స్టాలో పొస్ట్ చేశారు.

సిటాడెల్ హనీ బన్నీ సిరిస్ తీసేటప్పుడు.. దర్శకుడు, మూవీ టీమ్ తో గడిపిన మెమోరీస్ ను ఫోటోలను సామ్ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సామ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

సామ్, వరుణ్ ధావన్.. కాంబోలో.. వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీతెరమీదకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరిస్..నవంబరు 6 నుంచి స్ట్రీమింగ్  అవుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరిస్ కు..రాజ్ అండ్ డికే దర్శకత్వం వహించారు.

ఈ వెబ్ సిరిస్ కు మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ఈ వెబ్ సిరిస్ కు మరో ఘనత సాధించినట్లు తెలుస్తొంది. పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్ ఛాయస్ నామినేషన్స్ లో ఉత్తమ విదేశీ భాష సిరీస్ లో  అందించే అవార్డుకి నామినేట్ అయినట్లు సమాచారం.  

ఈ విషయాన్నీరాజ్ అండ్ డి కె  అధికారంగా చెప్పినట్లు తెలుస్తొంది. ఈ అవార్డుల వేడుక జనవరి 12న జరుగనుందంట. సామ్.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ వెబ్ సిరిస్ చేశారని.. సామ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని మూవీ టీమ్ ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం.. సామ్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని కూడా వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు తెలుస్తొంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link