Samsung Galaxy A14 5G Price: రూ.7,399కే Samsung Galaxy A14 మొబైల్‌..వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్‌..

Sun, 17 Sep 2023-12:44 pm,

ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్‌ Galaxy A14 5G మొబైల్‌ మొత్తం 3 వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా మూడు కలర్స్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉంది. అత్యంత ఎక్కువగా ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌ కలర్‌లో సేల్‌ అవుతోంది.  

ఫ్లిప్‌కార్ట్‌లో SAMSUNG Galaxy A14 5G స్మార్ట్‌ ఫోన్ మొదట ధర రూ. 18,499తో విక్రయించింది. అయితే ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా 13 శాతం తగ్గింపుతో రూ. 15,999కే అందిస్తోంది. అంతేకాకుండా మరింత తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది.   

SAMSUNG Galaxy A14 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫర్స్‌లో భాగంగా సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు దాదాపు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు SBI క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు.  

సాంసంగ్‌ Galaxy A14 5G మొబైల్‌పై వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ కార్డ్‌ను కొనుగోలు చేసి రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా  అదనంగా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.  

ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు.  ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 7,399 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రూ. 1000 వరకు అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో మీరు సాంసంగ్‌ Galaxy A14 5G మొబైల్‌ రూ. 7,399కే పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link