Samsung Galaxy S23 5G Price Cut: అసలైన న్యూ ఇయిర్ ఆఫర్ ఇదే.. రూ.89 వేల Samsung Galaxy S23 5G మొబైల్ కేవలం రూ.23 వేలకే..
ముఖ్యంగా సాంసంగ్ మొబైల్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే విడుదలైన కొన్ని సాంసంగ్ మొబైల్స్‌పై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తుందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఇటీవలే మార్కెట్లో విడుదలైన సాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌లో SAMSUNG Galaxy S23 5G ఒకటి. ఇది అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్స్ మధ్య అందుబాటులో ఉంది. న్యూ ఇయర్ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో SAMSUNG Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ క్రీమ్ కలర్‌తో పాటు మరో మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్లలో లభిస్తోంది. ఇటీవలే ఫ్లిఫ్‌కార్ట్ నిర్వహించిన స్పెసిఫికేషన్స్ స్కోరులో దాదాపు 9.4 స్కోర్ పొంది.. బెస్ట్ ఇన్ క్లాస్ స్మార్ట్ ఫోన్ గా పేరు పొందింది.
ఇక ఫ్లిఫ్‌కార్ట్ 128 జీబీ ఇంటర్నల్ బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. మార్కెట్లో దీని అసలు ధర MRP రూ.89,000 కాగా న్యూ ఇయర్ హాట్ డీల్లో భాగంగా 57% ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను కేవలం రూ.37, 999కే అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును ఉపయోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఐదు శాతం ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.
ఇక న్యూ ఇయర్ హాట్ సేల్‌లో భాగంగా అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించడానికి.. ముందుగా పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను రూ.23 వేలకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.