Saturn Transit: శనిగ్రహం నక్షత్రం మారుతోంది ఈ 6 రాశులకు డిసెంబర్ 27 వరకు ఏం జరగబోతోంది

Thu, 19 Sep 2024-11:27 am,

మీన రాశి

ఈ రాశి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. శని గ్రహం అనుగ్రహం ఉంటుంది కానీ అప్రమత్తంగా ఉండాలి. మంచి పనులు చేయాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. రాజకీయ, విద్యా రంగంలో ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండకపోతే ఆర్ధికంగా నష్టపోతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. 

తుల రాశి

హిందూమతంలో శనిగ్రహాన్ని న్యాయదేవతగా పరిగణిస్తారు. శనిగ్రహానకి ఈ రాశి ఇష్టమైందే అయినా శతభిష నక్షత్రంలో ప్రవేశం కారణంగా కష్టాలు తప్పవు. చేసిన కర్మల్ని బట్టి ప్రతిఫలం ఉంటున్నందున డిసెంబర్ 27 వరకూ ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి

ఈ రాశివారికి రానున్న మూడు నెలలు అంటే డిసెంబర్ వరకూ ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. కెరీర్ పరంగా అప్రమత్తంగా ఉండాలి. 

మిధున రాశి

శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఆర్ధికంగా నష్టాలు తప్పవు. ఖర్చులు పెరిగిపోతాయి. ఆదాయం తగ్గుతుంది. ఆర్ధిక ఇబ్బందులకు తోడు మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. దాంతో ఆరోగ్యం పాడవవచ్చు. 

మేష రాశి

ఈ రాశి జాతకులు చెడు పనులు, సావాసానికి దూరంగా ఉండాలి. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. లేకపోతే మూల్యం భారీగా చెల్లించుకోవల్సి వస్తుంది. కొత్త పనులు లేదా వ్యాపారాలు అస్సలు మొదలెట్టకూడదు. 

కుంభ రాశి

శని గ్రహం సొంత రాశి ఇది. అందుకే శతభిషలో శని గ్రహం మారడంతో ఈ రాశి జాతకులకు చాలా లాభం కలగనుంది. ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు మెరుగైన సమయం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link