Mahanati Savitri: మహానటి సినిమాలో సావిత్రి జీవితం నుండి దాచేసిన షాకింగ్ నిజాలు..!
ఒకప్పటి లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. 2018 లో విడుదలైన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డుల వర్షం కురిపించింది. సినిమాలో తన అద్భుతమైన నటనకి గాను కీర్తి సురేష్ తో పాటు సినిమాకి కూడా నేషనల్ అవార్డులు లభించాయి.
అయితే సావిత్రి బయోపిక్ అంటూ విడుదలైన ఈ సినిమాలో అన్ని నిజాలే ఉన్నాయా? అంటే కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవాలి. సినిమా కోసం.. కమర్షియల్ ఎలిమెంట్లను జోడించడం కోసం.. సావిత్రి జీవితాన్ని దర్శక నిర్మాతలు కొంచెం మార్చారు. ఈ నేపథ్యంలో సావిత్రి జీవితంలో కొన్ని నిజాలను కూడా దాచేసారు. అవేంటో చూద్దాం..
సినిమాలో చూపించినట్లు సావిత్రి తన తండ్రి దగ్గర నుంచి కూడా ప్రేమను పొందలేదు. ఆమె సవతి తండ్రి పెద్ద డబ్బు మనిషి. సినిమాలో చూపించినంత ప్రేమను ఆమెకు ఇవ్వలేదు. సావిత్రికి తన తల్లితో కూడా మంచి సంబంధాలు లేవు. ఆమె జీవితంలో ఉన్న ఖాళీని పూర్తి చేయగలడు అని అనుకున్న ఒకే ఒక్క వ్యక్తి కూడా ఆమెను మోసం చేయడంతో సావిత్రి కృంగిపోయింది.
ఒక తమిళ్ నాడు రాజకీయ నాయకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు.. సావిత్రి అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో పవర్ లోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు సావిత్రి మీద పగ పట్టి ఆమె మీద ఇన్కమ్ టాక్స్ రైడ్లు జరిపించి ఆమె ప్రాపర్టీలను సీల్ చేశారు. ఆమె కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తమిళనాడులోని ఒక విలాసవంతమైన వీధిలో ఇళ్లన్నీ ఆమె పేరు మీదే ఉండేవి. షూటింగ్ సమయంలో పెద్ద గోను సంచిలో డబ్బులు తీసుకుని వెళ్లి మరీ సావిత్రి డబ్బులు లేని వాళ్ళకి పంచిపెట్టేది. ఆమె నుంచి సహాయం పొందిన ఎవరూ ఆమె దుస్థితిలో ఉన్నప్పుడు.. ఆమెకు తోడుగా నిలవలేదు.
సావిత్రి తన కూతురిని బాగా డబ్బున్న ఒకరికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కానీ సావిత్రి ఆఖరి రోజుల్లో సొంత కూతురు కూడా ఆమెను వెలివేసింది. తనని డబ్బులు అడగద్దు అంటూ దూరం పెట్టింది. కానీ సావిత్రి చనిపోయిన తర్వాత మాత్రం అందరి కంటే ముందు ఆమె ప్రాపర్టీ ల కోసం వచ్చేసింది. సావిత్రి ప్రేమించిన వాళ్ళందరూ ఆమెను మోసం చేసిన వాళ్ళే. జీవితం మొత్తం కేవలం కష్టాలను మాత్రమే అనుభవించిన సావిత్రి జీవితం చాలా మందికి ఒక పెద్ద పాఠం లాంటిది. అందరినీ త్వరగా నమ్మకూడదు అని, జీవిత భాగస్వామి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని సావిత్రి జీవితం మనకు నేర్పిస్తుంది.