Sayani Gupta: డైరెక్టర్ కట్ చెప్పినా ఆ హీరో ముద్దులతో రెచ్చిపోయాడు: ఓ హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ హీరోయిన్ సయానా గుప్తా హాట్ హాట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను తన మత్తులో ముంచెస్తోంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్, మార్గరీటా విత్ ఏ స్ట్రాలో అనే సినిమాలో సయానా గుప్తా నటించింది. కొన్ని షూటింగ్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
మార్గరీటా విత్ ఏ స్ట్రా సినిమా షూటింగ్లో ఓ హీరో తనతో రెచ్చిపోయి నటించాడని వాపోయింది. ఆ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సయానా గుప్తా వివరించింది.
ఓ సన్నివేశంలో ముద్దు పెట్టుకోవాల్సి ఉంది. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా ఆ నటుడు ఇంకా ముద్దులు పెడుతూనే ఉన్నాడని సయానా గుప్తా వెల్లడించింది. దీంతో తనకు చాలా కోపం వచ్చిందని చెప్పింది. కొన్ని విషయాలు చాలా చిన్నవిగా కనిపించినా అవి చిరాగ్గా ఉంటాయని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మార్గరీటా విత్ ఏ స్ట్రా సినిమా షూటింగ్ గోవా బీచ్‌లో తీశారు. ఓ సన్నివేశంలో భాగంగా బీచ్‌లోని ఇసుక తిన్నెలపై నేను పడుకున్నాను. అయితే ఆ సమయంలో చాలా అసౌకర్యానికి గురయ్యాను. అక్కడ 70 మందికి పైగా నిలబడి ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో అందరూ మొగాళ్ల ముందు నటించేందుకు ఇబ్బందికి గురయ్యా అంటూ వాపోయింది.
షూటింగ్ ప్రాంతాల్లో మహిళలకు సరైన భద్రత, సౌకర్యం లేదని ఆ ఇంటర్వ్యూలో సయానా గుప్తా వివరించింది. తెలుగు వారికి పరిచయం లేకపోయినా బాలీవుడ్లో సయానా గుప్తా సుపరిచితం. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది.