SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI Latest Update) తమ ఖాతాదారుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ను ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ స్కీమ్(SBI MF Retirement Benefit Scheme) పేరుతో ఖాతాదారులకు ప్రయోజనం కల్పించేందుకు సిద్ధమైంది.
Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ ఎస్‌బీఐ ట్రాన్సాక్షన్స్ చేయలేరు

ఫిబ్రవరి 3వ తేదీ 2021లోగా ఈ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ స్కీమ్‌ను కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ సూచించింది. అగ్రెసివ్, అగ్రెసివ్ హైబ్రిడ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, కన్జర్వేటివ్ ప్లాన్ వంటి నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను ఖాతాదారుల కోసం తీసుకొచ్చింది.

సిస్టమేటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్(SIP) ద్వారా గరిష్టంగా మీరు రూ.50 లక్షల వరకు పొందవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ను కనీసం రూ.5వేలతో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. అగ్రెసివ్ ప్లాన్‌లో భాగంగా ఫారిన్ ఈటీఎఫ్‌లు వంటి ఓవర్సీస్ సెక్యూరిటీల్లో కూడా 35 శాతం వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్(SBI MF Retirement Benefit Scheme) ద్వారా ఈక్విటీలో చేసిన పెట్టుబడులపై 10 శాతం వరకు రిటర్న్స్ తిరిగి పొందవచ్చు. ఇతర బ్యాంకులతో పోల్చితే అధిక రాబడిని అందిస్తోంది. కానీ నేషనల్ పెన్షన్ స్కీమ్ తరహాలో దీనికి పన్ను మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.
Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే
ఎస్‌బీఐ అందిస్తున్న మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌లో ‘సిప్’ ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇన్సూరెన్స్ ఆఫర్ కూడా అందిస్తుంది. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ మాత్రం వర్తించవని గుర్తించుకోవాలి. మరిన్ని వివరాలను బ్యాంకు వెబ్‌సైట్‌లోగానీ, బ్యాంకుకు వెళ్లడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.