School Holidays: తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్ వినతి..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'ఫెంగల్' తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తగిన జాగత్రలు తీసుకోవాలని కోరింది.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. గత నెలలో కూడా విద్యార్థులకు స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి. భారీ వర్షాల వల్ల ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.
ఏపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ట్యాంకర్ల సహాయంతో ఇళ్లను శుభ్రం చేయించింది. అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం తుఫాను ప్రభావం ఉంది. ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో రెండు రోజుల (29, 30) పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రాంతాల్లో ఆ రెండు రోజులు అన్ని స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని, అదేవిధంగా నవంబర్ 30వ తేదీ కోస్తా జిల్లాలో సెలవు ప్రకటించాలని భారత వాతావరణ శాఖ కోరింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ తుఫాను రానుంది. ఈ ప్రభావం డిసెంబర్ మొదటి వారంలో కూడా కొనసాగనుంది. ప్రభుత్వం వర్షం ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కోరింది.
మత్స్య కారులకు కూడా ఇప్పటికే వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. వరి కోతకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం ఆరబెట్టే సమయం కాబట్టి ముందుగానే వాతావరణం అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.