Lunar Eclipse 2024: రెండో చంద్ర గ్రహణం ఈ నెలలో ఎప్పుడు రానుంది తెలుసా? సూతక కాలం ఎప్పుడు ప్రారంభం?
సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా అశుభం అని మన జ్యోతిష్యులు చెబుతారు. ఇవి 12 రాశులపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా గర్భిణులు బయటకు రాకూడదని అంటారు. వారు ఏ పనిచేయకూడదు.
ఈ నెలలో సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే, ఈ మాసంలోనే పితృపక్షం రోజులు కూడా ప్రారంభం అవుతాయి. చంద్ర గ్రహణం ఉదయం 6:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది ఉదయం 10:17 గంటలకు పూర్తవుతుంది. మొత్తం చంద్ర గ్రహణం సమయం 4 గంటల 6 నిమిషాలు.
సూతకం అంటే అశుభ సమయం అంటారు. సాధారణంగా ఈ చంద్ర గ్రహణం మన దేశంలో కనిపించదు. మనకు సూతకం కూడా ఉండదు. గ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ రెండో చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రిక, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రం, అంటార్కిటిక్, అట్లాంటిక్ సముద్రం వద్ద కనిపిస్తుంది.
రాశులపై చంద్రగ్రహణ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ, మేషం, కర్కాటకం, తుల, మకర రాశిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)