Actress Meena: రెండో పెళ్లిపై రూమర్స్.. మళ్లీ స్పందించిన సీనియర్ నటి.. ఏమందో తెలుసా..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాల నటీనటుల జీవితాలను గుర్చి ఇష్టమున్నట్లు రూమర్స్ వైరల్ చేస్తున్నారు. మెయిన్ గా హీరోయిన్ ల వ్యక్తిగత విషయాలు, లవ్ ఎఫైర్స్, వారు కూర్చున్న .. లేచిన ఏ పనిచేసిన కూడా వెరైటీగా వైరల్ గా చేస్తున్నారు.
కొంత మంది మాత్రం ఇలాంటి ట్రోలర్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం..ఈ ట్రోలర్స్ కు వారి రేంజ్ లను సమాధానం చెబుతున్నారు. ఇటీవల కొంత మంది హీరోయిన్ లు తరచుగా పెళ్లి విషయాల్లో ట్రోల్స్ కు గురౌతున్నారు.
తాజాగా, సీనియర్ నటి మీనా మళ్లీ ట్రోలర్స్ బారిన పడినట్లు తెలుస్తొంది. ఆమె తెలుగు, తమిళ్ , కన్నడ, మళయాళం లోని పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. అనుకొని విధంగా ఆమె భర్త.. విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో చనిపోయాడు.
అప్పటికి ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఇంకేముంది.. ట్రోలర్స్ ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారని గతంలో వైరల్ గా చేశారు. ఆమె అప్పుడు కూడా తనకు పెళ్లి ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చింది. తన బిడ్డను చూసుకొవడమే తన కర్తవ్యమని తెల్చి చెప్పింది.
మళ్లీ తాజాగా, నటి మీన తమిళ్ హీరో ధనుష్ తో పెళ్లి అని, మరో స్టార్ డైరెక్టర్ తో పెళ్లి అంటూ కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మళ్లీవిసిగిపోయిన మీనా.. ఈ సారి ట్రోలర్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. ఇలాంటి పనులు మానుకొవాలని హెచ్చరించినట్లు సమాచారం.
ఒక వేళ తన జీవితంలో ఏదైన అనుకుంటే.. తప్పకుండా .. చెప్తానని.. మీకొ దండం అని.. ఇలాంటి లేని పోనీ వార్తలు ట్రోల్స్ చేసి డిస్టర్బ్ చేయోద్దని కూడా వేడుకుందని తెలుస్తొంది. దీంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ట్రోలర్స్ ను ఏకీపారేస్తున్నారు.