Home Loan: సీనియర్ సిటిజన్లు హోంలోన్ తీసుకోవచ్చా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే

Fri, 13 Dec 2024-10:14 am,

Senior Citizens Home Loan: సొంతంగా ఇల్లు సీనియర్ సిటిజన్స్ హోమ్ లోన్:ఉండాలనేది ప్రతి ఒక్కరికీ కోరిక. సీనియర్ సిటిజన్లకు ఇది అత్యంత అవసరం. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల కారణాలతో రిటైర్మెంట్ తర్వాత కూడా సొంత ఇల్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు కూడా హోంలోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా కట్టుకోవచ్చు. బ్యాంకులు వీరి ఆదాయంతో పలు అంశాలను పరిగణలోనికి తీసుకుని హోంలోన్ ఇస్తుంటాయి. 

పనిచేసే ఉద్యోగులతో పోల్చితే బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు కొంచెం ఎక్కువ వడ్డీతో హోంలోన్ ఇచ్చేందుకు షరతులు పెడతాయి. రిటైర్మెంట్ తర్వాత హోంలోన్ తీసుకోవడం అనేది సవాలుతో కూడుకున్నదే కావచ్చు. కానీ సరైన ప్రణాళిక, ఆర్థిక అవగాహనతో లోన్ తీసుకోవడం కూడా సాధ్యమే. కాబట్టి సీనియర్ సిటిజన్లు హోంలోన్ తీసుకునే అవకాశాన్ని పెంచుకునేందుకు మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి  చూద్దాం.   

లోన్ టెన్యూర్ తక్కువగా ఉండాలి:  బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపనీలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు లోన్ అర్హతను నిర్ణయించేందుకు రిటైర్డ్ వ్యక్తులు గతంలో తీసుకున్న లోన్స్ గురించి క్రాస్ చేసిన తర్వాతే లోన్ ఇచ్చేందుకు అంగీకరిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత కాలంలో ఆదాయం తగ్గుతుంది. వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి లోన్స్ ఇచ్చే సంస్థలు 70ఏళ్లకు మించిన వ్యక్తులకు లోన్స్ ఇచ్చేందుకు అంగీకరించవచ్చు. కాబట్టి ఇలాంటివారు స్వల్పకాలిక లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.   

క్రెడిట్ స్కోరు:  హోంలోన్ పై వడ్డీరేట్లను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్, అనుకూలమైన నిబంధనలతో హోంలోన్ పొందే అవకాశాలను పెంచుతుంది. తక్కువ వడ్డీ రేటుతో లోన్ వేగాన్ని పొందడానికి లోన్ దరఖాస్తుదారుడికి సంబంధించిన క్రెడిట్ స్కోర్ ముఖ్యం. అందుకే 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోవాలి.   

తక్కువ లోన్ వాల్యూవ్ తక్కువ లోన్ వాల్యూవ్ ను ఎంచుకోవడం వల్ల హోంలోన్ పొందడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక ఇంటిని రూ. 50లక్షలతో అంచనా వేసి బ్యాంకు రూ. 40లక్షల లోన్ అందిస్తే..ఎల్ టీవీ నిష్పత్తి 80శాతం ఉంటుంది. లోన్ దరఖాస్తు దారుడు తక్కువ ఎల్టీవీ నిష్పత్తిని ఎంచుకుని ఎక్కువ డౌన్ పేమెంట్ ను చెల్లిస్తే బ్యాంకులు లోన్ మంజూరు చేసేందుకు మొగ్గుచూపుతాయి. తక్కువ లోన్ మొత్తం నెలలవారీ ఈఎంఐలను తగ్గిస్తుంది. ఇది తక్కువ ఆదాయం గల పెన్షనర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.   

స్థిరమైన ఆదాయం  హోంలోన్ కోసం దరఖాస్తు చేసే ముందు సీనియర్లు తమ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. నెలలవారీ ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, బాధ్యతలు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటివి అన్ని మీ ఆర్థిక స్తోమతపై ఒక స్పష్టతను ఇస్తాయి. లోన్ దరఖాస్తుదారులు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేందుకు లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ఇవి సహాయపడతాయి.   

కుటుంబ సభ్యుడిని సహ దరఖాస్తుదారుడిగా  స్థిరిమైన ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న యువ కుటుంబ సభ్యుడిని సహదరఖాస్తుదారుడిగా లోన్ కు చేర్చినట్లయితే సీనియర్ సిటిజన్ కు లోన్ అర్హత పెరుగుతుంది. పిల్లలు లేదా జీవిత భాగస్వామిని సహ దరఖాస్తుదారుడిగా చేర్చడం ద్వారా హోంలోన్ పొందే అవకాశాలు పెరగడమే కాదు లోన్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. సినియర్లు హోంలోన్ విషయంలో యువ సహదరఖాస్తుదారుడిని చేర్చుకుంటే లోన్ తిరిగి చెల్లించే కాల వ్యవధి కూడా పొడిగించుకోవచ్చు.   

లోన్స్ ఇచ్చే సంస్థలు హోంలోన్ తోపాటు హోంలోన్ ఇన్సూరెన్ స్కీం తీసుకోవడం మంచిది. హోంలోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కానప్పటికీ..పదవీ విరమణ చేసిన  వ్యక్తులు లోన్ కోరుతున్న ప్రాపర్టీని భద్రపరచడానికి దీన్ని తీసుకోవాలి. ఏదేమైనా ఇప్పటికే బీమా కొనుగోలు చేసినవారు హోంలోన్ ఇన్సూరెన్స్ పొందాల్సిన అవసరం ఉండదు. వారి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను లోన్స్కు అనుషంగీకరంగా సెలక్ట్ చేసుకోవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link