Shani Dev Blessings: శని నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం.. అడుగుపెట్టిన చోట డబ్బుల వర్షమే!

Sat, 28 Sep 2024-9:45 am,

 రాహు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేస్తే కొన్ని రాశులు ఎంతో ప్రభావితమవుతాయి. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. రాహు గ్రహం దాదాపు 18 నెలల ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ గ్రహం వచ్చే సంవత్సరం మార్చి వరకు మీనరాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఇదిలా ఉంటే రాహు గ్రహం అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేయిస్తుంది. ఇలా సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రత్యేకమైన మార్పులు కూడా వస్తాయి. 

ప్రస్తుతం శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచార దశలో ఉంది. అయితే రాహు గ్రహం కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవంబర్ మొదటి వారంలో రాహు గ్రహం ఈ నక్షత్ర సంచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

రాహు గ్రహం గ్రహ సంచారం చేస్తే ఎలాంటి ప్రభావం ఏర్పడుతుందో నక్షత్ర సంచారం చేసిన అలాంటి ప్రభావమే ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని పాలించే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహు సంచారం చేయడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా కొంతమంది ఊహించని ధన లాభాలు కూడా పొందుతారు. 

రాహు నక్షత్ర సంచారం చేయడం కారణంగా మకర రాశి వారికి డబ్బు సంబంధిత విషయాల్లో ఎక్కువగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశి వారికి డబ్బు సమస్యలు పరిష్కారం అయ్యి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నవంబర్ 10వ తేదీ నుంచి మకర రాశి వారికి అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరగడమే కాకుండా పదోన్నతులు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

రాహు నక్షత్ర సంచారం చేయడం కారణంగా కుంభ రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో కీలక నిర్ణయాల తీసుకుంటారు. అలాగే వీరు డబ్బులు పొదుపు చేయడం వల్ల ఊహించని లాభాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మి వ్యక్తులు రాహు నక్షత్ర సంచారం కారణంగా అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా పొందుతారు.   

రాహు సంచారం కారణంగా సింహ రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ నుంచి వీరికి కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link