Shani Gochar : 2025లో ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. ఈ రాశుల వారికీ గ్యారంటీగా పెళ్లి..
జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి చివరి వారంలో శని దేవుడు కుంభ రాశి నుంచి మీన రాశికి ప్రవేశించబోతున్నాడు. శని మీన రాశికి ప్రవేశించడం వల్ల మకర రాశి వారు గత యేడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏల్నాటి శని ప్రభావం పూర్తిగా తొలిగిపోనుంది. అంతేకాదు మేష రాశి వారికి రాబోయే 7 యేళ్లు ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.
కుంభ రాశి : 2025 శని మీన రాశి వలన కుంభరాశికి మరో రెండున్నరేళ్లు ఏల్నాటి శని దశ నడస్తోంది. . అంతేకాదు కొంత కాలం పాటు డబ్బుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయవచ్చు. కష్ట పడినా.. ఫలితం బూడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశాలున్నాయి. శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టవద్దు. ఈ యేడాది ఏల్నాటి శని ప్రభావం వలన ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న వివాహా ప్రయత్నాలు ఈ సారి ఫలించే అవకాశాలున్నాయి.
మేషరాశి: మీనరాశిలో శని దేవుడు సంచారము వలన మేష రాశికి ఏల్నాటి శని ప్రభావం ఆరంభం కానుంది. దీని వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండకపోవచ్చు. ఆదాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణాలు చేసే అవకాశం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మీకు అనుకోని అవాంతరాలు పెరుగుతాయి. మానసిక ఆందోళనతో అనుకోని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అంతేకాదు ఈ సమయంలో ప్రతి శనివారంతో పాటు శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి నల్ల నువ్వులతో పూజా.. తైలాభిభిషేకం చేయడం వలన కొంత మేర ఉపశమనం పొందవచ్చు.
మీన రాశి.. మీనరాశికి మరో ఐదేళ్లు వరకు ఏల్నాటి శని ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అంతేకాదు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. జీవితంలో పలు సమస్యలను ఎదుర్కునే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంల అప్రమత్తత అవసరం. ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. మీ ఆర్ధిక సమస్యలను ఎవరు పట్టించుకునే అవకాశాలుండవు. తీవ్రమైన ఒత్తిడిత లేని పోని నిర్ణయాలు తీసుకోవద్దు. చేసే ఉద్యోగం పెద్దగా కలిసి రాకపోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంత తేలికగా ఫలించవు.కానీ వివాహా ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.
శని దేవుడు పరిహారాలు: ప్రతి శనివారం పేదలకు అన్నదానం చేయడంతో పాటు బ్రాహ్మణులకు దానం.. పేదలకు ధర్మం చేయడం ద్వారా శని దేవుడి అశుభ దృష్టి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శనివారం నాడు చీమలకు తినిపిస్తే అరగంట శని ప్రభావం తగ్గుతుంది. శనివారం నాడు హనుమంతుడిని పూజించడం ద్వారా ఏడున్నర శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు. శనివారం నాడు 11 సార్లు శని స్తోత్ర పారాయణం చేస్తే శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది.
నిరాకరణ: ఈ కథనంలో ఉన్న సమాచారం వివిధ మాధ్యమాలు, జ్యోతిష్యులు, పంచాంగం, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. ఈ కథనానికి జీ న్యూస్ బాధ్యత వహించదు.