Shivani Rajasekhar: తెల్ల చీరలో మెరిసిపోయిన శివాని రాజశేఖర్... పగటి పూటే వచ్చిన చందమామ

Thu, 04 Jan 2024-9:48 pm,

Shivani Rajasekhar Viral Pics: అద్భుతం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శివాని రాజశేఖర్. రాజశేఖర్‌‌.. జీవితాల కూతురైన శివాని తెలుగు సినిమాలలో తనకంటూ మంచి పేరు తెచ్చుకునింది.

తాను చేసింది అది కొద్ది సినిమాలే అయినా.. నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఈ నటి కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలో నటించింది. శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో లింగిడి లింగిడి పాట సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ తెచ్చిపెట్టుకుంది.

సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శివాని రాజశేఖర్. అద్భుతం కరోనా టైం లో ఓటీపీలోనే రిలీజ్ అవ్వగా ఆ తరువాత ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయం సాధించింది.   

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ నటి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శివాని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

న్యూ ఇయర్ సందర్భంగా.. వైట్ శారీలో.. రెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో వయ్యారాలు పోయింది శివాని. ఈ తెల్ల చీరలో మెరిసిపోతూ పొగటిపోతే చందమామ వచ్చినట్టు కనిపించింది. ఇక ఈ ఫోటోలకి సోషల్ మీడియా యూజర్స్ ఫిదా అయిపోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link