Shivathmika Rajasekhar: ప్రేమలో పడేస్తున్న శివాత్మిక రాజశేఖర్.. పసుపు రంగు చీరలో అందాలు..!

Sun, 04 Aug 2024-11:19 pm,

ఎన్నో సంవత్సరాల పాటు యాంగ్రీ యంగ్ మాన్ గా తనకంటూ.. మంచి పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. జీవితాన్ని పెళ్లి చేసుకున్న ఈ హీరోకి.. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్.. అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరూ కూడా కొన్ని సినిమాలలో కనిపించి.. తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

శివాని రాజశేఖర్ ఎక్కువగా ఓటీటీ సినిమాల్లో.. కనిపించింది. మరో పక్క శివాత్మిక రాజశేఖర్.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమాతో.‌.తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మ.

మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత.. కొన్ని అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా.. శివాత్మిక రాజశేఖర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూతురుగా ఈ సినిమాలో.. కనిపించి తన నటనతో మెప్పించింది ఈ హీరోయిన్.

అయితే శివాత్మిక రాజశేఖర్.. సినిమాలకన్నా కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో.. ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తూ తరచూ.. ఏవో ఒక ఫోటో షేర్ చేస్తూ.. ఉంటుంది శివాత్మిక.

తాజాగా శివాత్మిక.. చీరలో షేర్ చేసిన ఫోటోలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో పసుపు రంగు చీరలో కనిపిస్తూ.. శివాత్మిక సినీ ప్రేక్షకులను ప్రేమలో పడేస్తోంది. ఈ ఫోటోలు చూసినవారు.. ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడం ఖాయం.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఎంతో మంది అభిమానులు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link