Shobitha Suicide Letter: నటి శోభిత ఆత్మహత్యలో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖలో సంచలన విషయాలు..
Shobitha Suicide Letter: ప్రముఖ కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ లేఖలో యు కెన్ డూ ఇట్ అంటూ లేఖ లభ్యమైంది. అందులో ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ లేఖ రాసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంతేకాదు శోభిత మృతికి డిప్రెషన్ అసలు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈమె సీరియల్స్ తో పాటు సినిమాలకు దూరంగా ఉంది. అదే ఈమె ఆత్మహత్యకు ప్రేరేపించిందా..
మరోవైపు భర్త సుధీర్ తో శోభిత మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా.. వారి మధ్య ఏం జరిగింది. గత కొంత కాలంగా వారిద్దరు దూరంగా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
ఓ మాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ తో శోభితకు పరిచయం ఏర్పడింది. అలా పెంచుకున్న పరిచయం పెళ్లికి దారితీసింది. సుధీర్ విషయాకొస్తే.. తెలంగాణలోకి తక్కుగూడకు చెందినవారు.
పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉన్న శోభిత. వీరిద్దర మధ్య ఏమైనా డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా తేడా జరిగిందా.. ? కొన్ని రోజులు క్రితమే వెకేషన్ ట్రిప్ కోసం గోవాకు వెళ్లొచ్చారు శోభిత, సుధీర్.
వెళ్లినపుడు అంతా మంచిగానే ఉన్నా.. అక్కడ ఏమైనా జరిగిందా.. ? పెళ్లికి ముందు శోభితకు ఎవరితోనైనా ప్రేమలో ఉందా.. ఆ విషయం వెలుగులోకి రావడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.