Facts About Einstein Brain: ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్‌ స్టీన్ బ్రెయిన్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు ఇవే..

Wed, 18 Dec 2024-2:52 pm,

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 20వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు. అతని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వంటి ఆవిష్కరణలు భౌతిక శాస్త్రాన్ని మార్చివేశాయి. 1879 మార్చి 14న జర్మనీలో జన్మించిన ఐన్‌స్టీన్ తన చిన్ననాటి నుంచి విశ్వం గురించి ఆసక్తి కనబరిచేవారు.

 1921లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌పై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు. 18 ఏప్రిల్ 1955  ఐన్‌స్టీన్ మరణించినప్పుడు ప్రిన్స్‌టన్ హాస్పిటల్‌లో పనిచేసే పాథాలజిస్ట్ తోమాస్ హార్వే అతని మెదడును అనుమతి లేకుండా దొంగలించాడు.

హార్వే బ్రెయిన్‌ను దొంగలించడానికి గల కారణం  ప్రపంచంలోనే అత్యంత మేధావి బ్రెయిన్ ఎందుకు అంత ప్రత్యేకతమైనది అని తెలుసుకోవాలి ఇలా చేశాడని అధ్యయనాలు చెబుతున్నాయి. దొంగలించిన ఐన్‌స్టీన్‌ బ్రెయిన్‌ను అయిన 240 ముక్కలుగా చేసి, దానిపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నాడు.  

హార్వే ఐన్‌స్టీన్‌ బ్రెయిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు పంపి, దానిపై అధ్యయనాలు చేయించాడు. ఈ పరిశోధనల ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషాయాలు బయటపడ్డాయి.  ఐన్‌స్టీన్ మెదడులో సాధారణ మనుషుల మెదడుతో పోలిస్తే న్యూరాన్ల సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది.  

న్యూరాన్లకు సహాయం చేసే గ్లియల్ కణాలు కూడా ఐన్‌స్టీన్ మెదడులో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఐన్‌స్టీన్ మెదడులోని కొన్ని భాగాలు సాధారణ మనుషుల మెదడుతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్లు గమనించారు. ఉదాహరణకు అతని పారిటల్ లోబ్ (Parietal lobe) అనే భాగం ఇతరుల కంటే పెద్దగా ఉంది. ఈ భాగం గణితం, స్పేషియల్ రీజనింగ్ వంటి అంశాలకు సంబంధించినది.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడుపై చేసిన పరిశోధనలు మానవ మెదడు గురించి మనకు ఉన్న అవగాహనను పెంచాయి. అయితే ఇంకా చాలా విషయాలు అన్వేషించాల్సి ఉంది. ఐన్‌స్టీన్ మెదడు వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ పరిశోధకులను ఆకర్షిస్తూనే ఉంది.  

ఈ వ్యాసం సమాచారాత్మకమైనది. ఐన్‌స్టీన్ మెదడుపై చేసిన పరిశోధనల గురించి మరింతగా తెలుసుకోవడానికి మీరు ఇతర సైట్‌లను కూడా సంప్రదించవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link