Shriya Saran: వెకేషన్ ఎంజాయ్ చేస్తూ శ్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు
ఒక హిందీ ఆల్బమ్ తో తన కెరియర్ మొదలుపెట్టిన శ్రియ.. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. వెంటనే నాగార్జునతో సంతోషం సినిమాలో ఛాన్స్ అందుకుంది.
దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సంతోషం చిత్రం శ్రియ కెరియర్ ని మార్చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకొని శ్రియకి.. వరస సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వే నువ్వే చిత్రం కూడా.. ఈమెకు మంచి విజయం అందించింది.
ఆ తరువాత చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బాలు, నా అల్లుడు.. అంటూ వరసగా స్టార్.. హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది శ్రియ. మరో పక్క.. చిన్న హీరోలతో సైతం.. సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగించింది.
తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న శ్రియ. గత కొద్ది సంవత్సరాల క్రితం.. హిందీలో దృశ్యం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం మూడో భాగంతో.. హిందీ ప్రేక్షకులను త్వరలోనే పలకరించనుంది..
ఈ క్రమంలో ఈ హీరోయిన్ మళ్ళీ తెలుగు సినిమాలలో.. ఎప్పుడు కనిపిస్తుందా..అని ఎదురు చూస్తున్నారు..ఆమె అభిమానులు. ఇదిలా ఉండగా ప్రస్తుతం. శ్రియా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.