Shukra Gochar 2024: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశివారికి అప్రయత్నంగానే ఉద్యోగ అవకాశాలు..!
శుక్ర గ్రహం అంటేనే లగ్జరీ లైఫ్‌కు ప్రతీక. ఈయన సుకః సంతోషాలు అందిస్తారు. అయితే, ప్రతి నక్షత్రం కొంత కాలం ఒక రాశిలో ఉంటే మరికొంత కాలం ఇంకో రాశికి మారుతుంది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. శుక్రుడు నేడు అక్టోబర్ 16 అర్ధరాత్రి అనురాధ నక్షత్రంలోకి మారతాడు దీంతో కొన్ని రాశులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
వృషభ రాశి.. శుక్రుడు రాశి మారడం వల్ల బాగా కలిసి వచ్చే రాశి వృషభ రాశి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కూడా ఈ కాలంలో బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వృషభ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందే ఛాన్స్. మొత్తానికి ఈ రాశివారు ఈ సమయంలో ఆర్థికంగా బలం పుంజుకునే సమయం అని చెప్పవచ్చు.
ధనస్సు.. ధనస్సు రాశివారికి కూడా శుక్రుడు రాశిమార్పు వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది శుభ సమయం. వ్యాపారం చేసే వారికి కూడా ఆర్థికంగా లాభాలు గడించే సమయం. పని ప్రదేశంలో కూడా పేరుప్రఖ్యాతలు పొందే అవకాశం. మొత్తానికి ఈ సమయంలో ధనస్సు వారు ఏం చేసినా కలిసి వస్తుంది.
కుంభ రాశి... శుక్రుని ఆశీర్వాదం వల్ల కుంభ రాశి వారు కూడా లగ్జరీ లైఫ్‌ను పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగంలో శుభవార్త వింటారు. ప్రమోషన్ పొందే అవకాశం. కుంభ రాశివారు ఈ సమయంలో అప్పుల ఊబి నుంచి బయటపడతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)