Shukra - Venus Transit: శుక్ర, బుధ గ్రహాల అపూర్వ కలయిక.. ఈ మూడు రాశులకు జీవితంలో ఎన్నడు చూడని ధనయోగం..
శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికీ బంగారం లాంటి సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు విలాసవంతమైన గ్రహంగా పరిగణిస్తారు. బుధుడు వల్ల చదువు సంధ్యలకు బుద్దికి కారణంగా పరిగణిస్తారు.
2025లో జనవరి 4లో శుక్రుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రోజు బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
యేడాది ఆరంభంలో రెండు శుభ గ్రహాల కలయిక వల్ల కొన్ని కలయికల వల్ల మూడు రాశుల వారికీ బంగారం లాంటి సమయం ఆసన్నం కాబోతుంది. అంతేకాదు రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం వహించబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృశ్చికం: శుక్రుడు బుధుడు సంచారం వలన వృశ్చిక రాశి వారికీ ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఉపాధి రంగంలో భారీ విజయం అందుకుంటారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి ఇదే అనువైన సమయం. జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపబోతున్నారు.
కర్కాటక రాశి: శుక్రుడు, బుధుడు కలయికతో కర్కాటక రాశి వారు అన్ని రంగాల్లో విజయం వరిస్తుంది. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు అందుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ధనుస్సు : శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల కెరీర్ లో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోనున్నాయి. దేవుడు ఆశీర్వాదం వల్ల కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుంది. మానసిక అనుభవిస్తున్న కష్టాలు, ఒత్తిళ్లు తగ్గుపోతాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇపుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారులు మీ పాత పెట్టుబడుల ద్వారా అనుకోని లాభాలు అందుకుంటారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యం, పండితులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వడంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.