Side Effects of AC: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? ఈ అనర్థాలు మీకు తెలుసా?
ఫ్యాన్ గాలి సరిపోక కూలర్లు, ఏసీలపై ఆధారపడాల్సి వస్తోంది. కాస్త డబ్బు ఖర్చు పెడితే ఏసీలు కొనుగోలు చేయవచ్చు. దీంతో రూం టెంపరేచర్ త్వరగా చల్లబడుతుంది. రూంలోని వేడిని ఏసీ గ్రహించి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, దీనికి తగ్గట్టు కరెంటు బిల్లుల మోత కూడా మోగిపోతుంది.
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఏసీ గాలితో గొంతు, కళ్లు కూడా పొడిబారతాయి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించండి. రాత్రంతా ఏసీ ఆన్ చేసి పెట్టుకోకపోవడమే నయం.
రాత్రంతా ఏసీ పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. చెమట లేకుండా ఏంచక్కా నిద్రపోవచ్చు. అయితే, రాత్రి ఏసీ వేసుకుని పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకోవడం వల్ల అలెర్జీలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రాత్రి సాధారణంగా మన శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఇది అనారోగ్య సమస్యకు దారితీస్తుంది.
ఏసీ టెంపరేచర్ తగ్గిస్తు బిల్లు తక్కువగా వస్తుందని అనుకుంటారు.కానీ, ఇది అపోహ. కరెంటు బిల్లు పెరుగుతుంది. ఏసీని 24 డిగ్రీలు సెట్ చేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. రూం టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఏసీ తగ్గించే ప్రతి ఉష్ణోగ్రతకు 6 శాతం కరెంటు వినియోగం పెరుగుతుందట.
ఏసీని రాత్రంత నడిపించడం వల్ల ఏసీ బిల్లులు ఎక్కువవుతాయి. అందుకే రాత్రి పడుకునే ముందు థర్మోస్టాట్‌ను సెట్ చేసి పడుకోండి. దీనివల్ల మంచి నిద్ర కూడా పెడుతుంది. తద్వారా ఏసీ రూం చల్లబడిన తర్వాత ఆటోమెటిగ్గా ఆఫ్ అయిపోతుంది. దీంతో కరెంటు బిల్లులు పెరగకుండా ఉంటుంది. ఏసీలను కూడా సరైన సమయానికి సర్వీసింగ్ చేయించుకోవాలి. దీంతో బిల్లు ఆదా అవుతుంది. రూం త్వరగా చల్లబడుతుంది కూడా.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )