Singer Sunitha: 45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్..!

Mon, 18 Nov 2024-5:11 pm,

ప్రముఖ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ఈమె , తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్గా అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. 45 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ కి అందం విషయంలో పోటీ ఇస్తూ బిజీగా మారింది. 

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. వాస్తవానికి సాంప్రదాయానికి నిలువుటద్దం అని చెప్పడంలో సందేహం లేదు. చీర కట్టులో కూడా అందాల వొలకబోస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.

వృత్తిపరంగా ఎంతో సక్సెస్ చూసిన సునీత వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 19 ఏళ్లకే కిరణ్ అనే వ్యక్తిని వివాహం..చేసుకొని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అతడి నిజస్వరూపం బయటపడి అతడికి దూరమైంది.   

ఇక పిల్లలు పెళ్లీడుకొచ్చారు. అయితే తన తల్లికి ఒక తోడు కావాలని కోరుకున్నారో ఏమో మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేనితో సునీత పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి జరిగిందో లేదో అప్పుడే తల్లి కాబోతోంది అంటూ వార్తలు గుప్పించారు. అయితే దీనిపై అప్పట్లోనే స్పందించింది సునీత. 

ఇలాంటి రూమర్స్ సృష్టించేటప్పుడు కనీసం.. ఆలోచించరా అంటూ మండిపడింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి వార్తలు తెరపైకి వచ్చాయి.45 ఏళ్ల వయసులో మళ్ళీ తల్లి కాబోతోంది సింగర్  సునీత అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈమె ఎంత స్పందించినా రూమర్స్ ఆగడం లేదు. కాబట్టి ఇక చూసి చూడనట్టు వీటిని వదిలేసినట్లు సమాచారం. 

ఏది ఏమైనా సింగర్ సునీత క్లారిటీ ఇచ్చినా కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.. ఎంతో మంది హీరోయిన్స్ కి గాత్ర దానం కూడా చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link