Singer Sunitha wedding photos: సింగర్ సునీత పెళ్లి ఫోటోలు
అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సింగర్ సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది. గతంలో కిరణ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆయనతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు.
43 ఏళ్ల సునీతకు మునుపటి వివాహం ద్వారా ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇద్దరూ చదువు పూర్తి చేసి, వృత్తిలో నిలదొక్కుకునే పనిలో బిజీ అయ్యారు.
ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు, ప్రమోషన్ యాక్టివిటీస్ నిర్వహించే డిజిటల్ మీడియా సంస్థకు రామ్ వీరపనేని సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
సునీత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా రామ్ వీరపనేనికి చెందిన డిజిటల్ మీడియా ప్రమోషన్స్ సంస్థనే నిర్వహిస్తున్న కారణంగా ఆ ఇద్దరి మధ్య చాలాకాలంగా పరిచయం ఉంది. ఒకరికొకరు బాగా తెలుసు. రామ్ కూడా తన మొదటి భార్య నుండి చాలా కాలం క్రితమే డైవర్స్ తీసుకున్నారు. రామ్‌కి పిల్లలు లేరు.
తెలుగు సినీ పరిశ్రమలోని అందమైన గాయనీమణులలో సింగర్ సునీత కూడా ఒకరు. సింగర్ సునీత వాయిస్ అంటే ఇష్టపడని వారు లేరు. ఆమె తన పాటలతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
సింగర్ సునీత, రామ్ వీరపనేని జంటను ఆశీర్వదించేందుకు అనేక మంది సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహిత మిత్రులు ఈ పెళ్లి వేడుకకు తరలివచ్చారు.
సింగర్ సునీతకు ఆమె పిల్లలే పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి తల్లి వివాహం జరిపించడం సింగర్ సునీత పెళ్లి ( Singer Sunitha wedding ) వేడుకలో హైలైట్‌గా నిలిచింది.
Also read : Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు
Also read : Actress Pranitha Subhash: ప్రణీత సుభాష్‌కి కాబోయే భర్త ఇలా ఉండాలంట
Also read : Niharika Konidela: పెళ్లి తర్వాత నిహారిక కొత్త ప్రయత్నం
Also read : Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్