Smoking Age Limit: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!

Smoking Age Limit to be Raised to 21: క్రమ క్ర మంగా కాలేజీ విద్యార్థుల నుంచి స్కూల్ విద్యార్థులకు కూడా ధూమపానం(Cigarette) అలవాటుగా మారుతోంది. గుట్కాలు తినడం, స్మోకింగ్ చేయడం వల్ల అనారోగ్యం దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల కోసం ముసాయిదా రూపొందించింది. ఆ ముసాయిదాలోని ముఖ్యమైన అంశాలు మీకోసం..

విడి సిగరెట్ల విక్రయం నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇది అమలులోకి రానుంది.
Also Read: Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..
పొగ త్రాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచడం. ఈ మేరకు ముసాయిదాలో చేర్చారు.
Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?
స్మోకింగ్ కోసం విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, ఇతరత్రా భవనాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మోకింగ్ రూమ్స్, స్థలాలు మూసివేయాలని నిర్ణయం.
విద్యార్థులను ఈ మహమ్మారికి దూరంగా ఉంచడంలో భాగంగా విద్యాసంస్థలకు కనీసం 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం.
Also Read: Cloves Benefits: లవంగాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. 21ఏళ్లు నిండని వారికి పొగాకు ఉత్పత్తులతో పాటు సిగరెట్లు విక్రయించడం నేరం అవుతుంది. ఈ నిబంధనలు ఉల్లింఘిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు 7 ఏళ్లపాటు జైలు శిక్ష తప్పదు.