Snake Bite Remedies: పాము కాటు వేసిన వెంటనే ఇది తింటే సేఫ్.. ఆ దివ్యఔషధం ఏంటో తెలుసా..!
మన దేశంలో దాదాపు 300 రకాల పాములు నివసిస్తున్నాయి. వీటిలో 60 జాతుల పాములు విషపూరితమైనవి. రస్సెల్స్ వైపర్, సా స్కేల్డ్ వైపర్, ఇండియన్ కోబ్రా, కామన్ క్రైట్ తదితరల స్నేక్స్ చాలా డేంజరస్.
విషపూరితమైన పాము కాటు వేస్తే.. నొప్పి రావడం.. కాటు వేసిన వాపు, తిమ్మిర్లు, వికారం, వాంతులు, వణుకు, అలెర్జీలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చర్మం రంగులో కూడా మార్పులు వస్తాయి. విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, కండరాల బలహీనత, దాహం, తక్కువ రక్తపోటు, చెమట ఎక్కువ పట్టడం వంటివి జరుగుతాయి.
పాము కాటుకు గురైన వ్యక్తికి కొంచెం నెయ్యి తినిపించి వాంతి వచ్చేలా చూడాలి. దీంతో విషం శరీరం అంతా వ్యాపించదు. గోరువెచ్చని నీరు తాగించి.. వాంతి చేయించండి. దీంతో పాము విషం ప్రభావం తగ్గుతుంది.
ఏదైనా కూరగాయ తీసుకుని.. దానిని మెత్తగా చేసి కాటు వేసిన చోట పూయాలి. విషం ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా.. సంక్రమణ ప్రమాదం ఉండదు. లేదంటే వెల్లుల్లిని మెత్తగా నూరి అందులో తేనె మిక్స్ చేసి కాటు వేసిన భాగంలో పూయాలి.
పాము కాటుకు గురైన వెంటనే.. ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించండి. పాము కాటును మళ్లీ ముట్టుకోకుండా.. వ్యక్తిని అనవసరంగా ఒత్తిడికి గురిచేయకుండా ప్రశాంతంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు పాటించే ముందు వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోండి. జీ తెలుగు న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.