Snake vs Mongoose: పాములు, ముంగిసను కాటు వేసిన విషం ఎక్కదంటారు... దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..
కొన్ని జంతువులు ఒకదానితో మరోకటి విభేదిస్తుంటాయి. పాములు, ముంగిసలకు అస్సలు ఒకదానికి మరోకటంటే పడదు. ఇవి రెండు కూడా ఎక్కువగా పొట్లాడుకుంటాయి. అడవిలో, పొలాల్లో పాములు, ముంగిసలు తిరుగుతుంటాయి.
పాముల మాదిరిగానే, ముంగిసలు కూడా దాదాపు.. 20 వరకు జాతులు ఉన్నాయి. ముంగిసలకు పాముల వాసల వస్తుందంటారు. అందుకే పాములు పట్టేవాళ్లు తప్పకుండా తమతో ముంగిసలను పెట్టుకుంటారు..
అడవులలో, చెట్లు గుబురుగా ఉన్న ప్రాంతాలలు పాములు ఉంటాయి. ఎలుకలు వేటాడటానికి పాములు బైటకు వస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు ముంగీసల బారిన కూడా పడుతుంటాయి.
ముంగిసను పాముపై దాడిచేసి దాని ముఖం కొరికేయాలని చూస్తుంది. కానీ పాములు కూడా అంతే చాకచక్యంతో ముంగిస దాడుల నుంచి తప్పించుకుని, పదే పదే కాటు వేస్తుంది. కొన్నిసార్లు పాములు ముంగిసపై విషాన్ని ఉమ్ముతాయి..
ముంగిస ఒంటి మీద బూరు చాలా గుబురుగా ఉంటుంది. అందుకే పాము కరిచిన కూడా దాని విషం ముంగిస శరీరంలోకి వెళ్లదంటారు. అదే విధండా.. పాము కొన్నిసార్లు ముంగిస ముఖంపై కూడా కాటు వేస్తుంది. ముంగిస శరీరంలో పాముకు కాటుకు ప్రతినిరోధకంగా పనిచేసే కొన్ని కణాలు ఉంటాయి. ఇవి పాము కాటేయగానే పనిచేస్తాయంట..
పాము ఎన్నిసార్లు ముంగిసను కాటేసిన కూడా ముంగిసకు ఎలాంటి హనీ జరగదు. కానీ ఇది ఒక పరిమితి వరకు మాత్రమే పనిచేస్తుందని, కానీ పాము పదే పదే కాటు వేస్తే మాత్రం పాము విషం, కూడా ముంగిసను చనిపోయేలా చేస్తుందని చెబుతుంటారు.
అందుకే ముంగిస పాముల దాడులు చూసుకుని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఇలా ముంగిస దేహంలో ప్రత్యేకంగా కణాలు ఉంటాయని చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)