Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..
సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో మొక్కలను పెంచుకుంటారు. కొంత మంది ఇంటి ముందర పెంచుకుంటే, మరికొందరు ఇంటి వెనుకాల గార్డెన్ కోసం స్థలం కేటాయిస్తారు.
వీటిలో కొందరు ఫలాల చెట్లు, మరికొందరు సువాసన ఇచ్చే మొక్కలు, పూల చెట్లు పెడుతుంటారు. ఇలాంటి రకరకాల మొక్కల్ని పెంచుతుంటారు. అయితే.. సువాసన గల మొక్కలకు పాములు ఎంతో ఆకర్శిత మౌతాయి.
అయితే.. చాలా మంది తమ ఇళ్లలో మల్లెపూలు, దేవదారు పూలు, పారిజాతం పూల చెట్లను ఎక్కువగా పెంచుకుంటారు. వీటి నుంచి సువాసన కిలో మీటర్ల దూరం కూడా వస్తుంది.
మొగలి పువ్వు చెట్లను కూడా చాలా మంది తమ ఇళ్లలో పెంచుకుంటారు. ఇలాంటి చెట్లను పెంచుకొవడం వల్ల వాటి నుంచి వచ్చే సువాసన.. గాలిలో వ్యాపిస్తుంది. దీంతో పాములు వీటిని ఆకర్శించబడతాయంట.
వీటి వాసన ఉన్న ప్రదేశాలకు పాములు పరిగెత్తుకుంటూ వస్తుంటాయంట. అందుకే ఇళ్లలో ఎక్కువగా సువాసన గల పూలు ఉన్న చెట్లను పెంచకూడదని నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ కాలంలో ఇవి చెట్ల నుంచి బైటకు ఆహారం కోసం వచ్చి సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో మనుషులు పాముల కాటుకు గురౌతారు.