Sobhita Dhulipala: అక్కినేని కోడలు మంచి ఫుడీలా ఉందే.. తెగ లాగించేస్తోందిగా..?

Sat, 31 Aug 2024-11:24 pm,

ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  వరుస సినిమాలతో ఒకప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె,  ఆ సినిమాల ద్వారా గుర్తింపు లభించలేదు కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందో.. అప్పుడు ఒక నైట్ లో ఆమె పాపులర్ అయిపోయింది. 

దాదాపు రెండు సంవత్సరాల పాటు చట్టపట్టలేసుకొని తిరిగిన ఈ జంట , ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్కసారిగా శోభిత పేరు భారీగా వైరల్ అయింది.  అంతేకాదు మోస్ట్ పాపులర్ వ్యూడ్ సెలబ్రిటీ జాబితాలో కూడా నెంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకుంది అంటే శోభితకు ఏ రేంజ్ లో నాగచైతన్య వల్ల గుర్తింపు లభించిందో చెప్పక్కర్లేదు. 

ఇకపోతే తాజాగా శోభితా ధూళిపాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన నెటిజెన్లు అక్కినేని కోడలు మంచి ఫుడీ లా ఉండే అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈమె మంచి భోజన ప్రియురాలు అన్నట్టుగా ఆ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. 

ఒక ఫోటోలో ఆమె పుష్టిగా ఫుల్ మీల్స్ తింటున్నట్టు, మరొక ఫోటోలో నూడిల్స్ తింటున్నట్టు , ఇంకొక ఫోటోలు ఛాయ్ ప్రిపేర్ చేస్తున్నట్టు ఇలా రకరకాల ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే భోజనం పై ఆమెకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి భోజనం టేస్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్.. అందరికీ ఆ అలవాటు,  ఆ టాలెంట్ ఉండదు. ఇక్కడేమో అక్కినేని కోడలు బాగా లాగించేస్తూ తనకు ఇష్టమైన ఫుడ్ ను  మరింత ఇష్టంగా తింటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి నాగచైతన్య తన కాబోయే భార్యకు ఇంకెన్ని రకాల వంటలు రుచి చూపించాలో అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.   

ఇకపోతే శోభిత విషయానికి వస్తే , ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలలో నటిస్తున్నా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ కారణంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే నాగచైతన్య, శోభిత డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా ఈ ఏడాది చివర్లో వీరు వివాహం జరగబోతుందని సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link