Sobhita Dhulipala: ఎంగేజ్మెంట్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని శోభితా.. అక్కినేని కోడలా మజాకా..!
Sobhita Dhulipala:శోభిత, అక్కినేని నాగ చైతన్యల ఎంగజ్మెంట్ ఈ యేడాది ఆగష్టు 8న ఘనంగా జరిగింది. సమంతతో విడాకుల తర్వాత శోభితతో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు. ఇక అక్కినేని ఇంటి వారి కోడలు కాబోతున్న శోభిత.. ఇప్పటికీ తన హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతూనే ఉంది.
శోభిత, నాగ చైతన్య ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరి నిశ్చితార్ధ వేడుక టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆల్రెడీ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి కూడా ఒక కథానాయికనే చైతన్య పెళ్లాడటం విశేషం.
శోభితా తల్లిదండ్రుల విషయానికొస్తే.. వీళ్ల నాయన వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల ఫ్యామిలీ విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది శోభిత. ఆ తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకు షిఫ్ట్ అయ్యారు. అక్కడే శోభితా ఉన్నత చదువులు చదివింది.
శోభితా..తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో కథానాయికగా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
శోభిత 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రమన్ రాఘవ్ 2.O’ మూవీతో కథానాయికగా పరిచయమైంది. అటు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.