Solar Eclipse 2023: సూర్య గ్రహణం మరుసటి రోజు నుంచే నవరాత్రులు, 3 రాశులకు మహర్దశే

Thu, 12 Oct 2023-6:46 pm,

సూర్య గ్రహణం ప్రభావంతో తులా రాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 14 నుంచి దశ మారిపోనుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఫలితంగా ఆర్ధికంగా లాభపడతారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. అన్నీ సానుకూల పరిణామలే ఎదురౌతాయి.

సింహ రాశి జాతకులకు సూర్య గ్రహణం ప్రయోజనం కల్గించనుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో మంచి ఉన్నతి కన్పిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తారు. అనుకోని సంపద కలిసొస్తుంది. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి.

సూర్య గ్రహణం కారణంగా మిధున రాశి జాతకులకు విశేష లాభం కలగనుంది. ఈ రాశి జాతకులకు సౌభ్యాగ్యం అందుతుంది. అంతేకాకుండా ఆర్ధికంగా ఊహించని లాభాలు కలగడం వల్ల మంచి స్థితిలో ఉంటారు. వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో పదోన్నతి ఖాయం. ఆకశ్మిక ధనలాభం కలగనుంది.

ఈ ఏడాది ఆఖరి సూర్య గ్రహణం తరువాతే నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆ ప్రభావం నేరుగా 12 రాశులపై పడనుంది. ముఖ్యంగా మూడు రాశులపై ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు రాశులకు అత్యంత శుభప్రదంగా ఉండనుంది. సూర్య గ్రహణం ఈ మూడు రాశులవారికి చాలా సానుకూల పరిణామాలు కల్గించనుంది. 

శరత్ నవరాత్రులకు సరిగ్గా ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 14వ తేదీన ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్య గ్రహణం ప్రభావం రాత్రి 8 గంటల 34 నిమిషాల నుంచి 2 గంటల 25 నిమిషాల వరకూ ఉంటుంది. ఈ గ్రహణం కన్యా రాశిలో చిత్రా నక్షత్రంలో ఏర్పడనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link