Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
విరాట్ కోహ్లీ లండన్‌లో ఇల్లు కొన్నాడని సమాచారం. కాస్త ఖాళీ సమయం దొరికినా లండన్‌కు వెళుతుంటాడు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత మైదానానికి దూరంగా ఉంటానని.. ఎవరినీ చూడనంటూ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో రిటైర్మ్‌మెంట్ తరువాత లండన ఉంటారని నెటిజన్లు అంటున్నారు.
తాజాగా లండన్ వీధుల్లో కోహ్లీ సాధారణ వ్యక్తిలా తిరుగుతున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. రోడ్డు దాటుతున్న దృశ్యాలు, రైల్వే స్టేషన్లలో తిరుగుతున్న వీడియోలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ బ్రిటీష్ పౌరసత్వం పొంది చాలా రోజులైందంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బ్రిటన్ పౌరసత్వం ఉంటే.. భారత్ తరఫున ఆడడం సాధ్యమవుతుందా..? అని చర్చించుకుంటున్నారు.
ఐసీసీ రూల్స్ ప్రకారం.. జాతీయ జట్టు తరుఫున ఆడాలంటే కచ్చితంగా ఆ దేశ పౌరసత్వం ఉండాలి. లేదా ఆ దేశంలో పుట్టి ఉండాలి. అలా కాకుంటే.. సంబంధిత దేశానికి పాస్‌పోర్ట్ ఉండాలి.
మన దేశ పౌరసత్వ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండొచ్చు. భారతీయ సంతతికి చెందినవారైతే.. ఓవర్సీస్ ఇండియన్ (OCI) కార్డును పొందవచ్చు. ఈ కార్డుతో మీరు మన దేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చు. కోహ్లీ లండన్‌లో స్థిరపడితే.. ఓసీఐ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.
చాలా మంది క్రికెటర్లు ఇతర దేశాల పౌరసత్వం తీసుకుని.. ఆ దేశ జాతీయ జట్ల తరుఫున ఆడారు. ఐర్లాండ్ నుంచి ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ తరుఫున ఆడగా.. దక్షిణాఫ్రికా నుంచి కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్‌కు ఆడాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలామందే ఉన్నారు.