Sravana masam 2024: రేపు శనివారం.. శనిత్రయోదశి.. ఈ పరిహారాలు పాటిస్తే.. అఖండ ధనయోగం.. నచ్చిన అమ్మాయితో పెళ్లి..
శ్రావణ మాసంను పండుగల మాసం అనికూడా చెబుతుంటారు. ఈమాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగ వస్తునే ఉంటుంది. ముఖ్యంగాశ్రావణ మాసం సోమవారం, శుక్రవారం, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
శ్రావణ మాసంలో శివారాధాన, అమ్మవారి ఆరాధన, విష్ణు ఆరాధన, శనిదేవుడి పూజలు చేస్తుంటారు.ఈ మాసంంలో ఏ చిన్న పూజలు, వ్రతాలు చేసిన కూడా అది కోటిరెట్లు లాభాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు.
శ్రావణ శనివారం అంటే.. రేపు త్రయోదశి తిథి కూడా కలిసి వస్తుంది. ఇలా రావడం ఎంతో విశేషమని పండితులు చెబుతుంటారు. ఈరోజున శనిదేవుడి ఆశీర్వాదం కోసం మనం చేసే ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలు కల్గిస్తాయని చెబుతుంటారు.
చాలా మంది శనీదేవుడు.. పాప గ్రహాంగా భావిస్తారు. కానీ ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే ఎల్లప్పుడు మంచి పనులు చేయాలని చెబుతుంటారు. శనిదేవుడు సూర్యుదేవుడి కుమారుడు, యమధర్మారాజు సోదరుడు.
ఏలినాటి, అర్ధష్టమ, సాడే సాతి శని ప్రభావంతో బాధపడుతున్న వారు రేపు.. శనిదేవుడి ఆలయంలో నూనెతో అభిషేకం చేయాలి, అంతేకాకుండా.. నల్లని నువ్వులు, నల్లని వస్త్రదానం చేస్తే మంచి ఫలితాలు కల్గుతాయి. నల్లని వస్తువులను దానంగా ఇవ్వాలి.
అంతేకాకుండా.. చాలా రోజుల నుంచి పెళ్లికాకుండా ఇబ్బందులు పడుతున్న వారు.. శనిత్రయోదశిరోజున.. పేదలకు వస్త్రదానం చేయాలి. అన్నదానం చేయాలి. నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లం పెట్టాలి. ఆవులకు మంచి గరకను తినేందుకు పెట్టాలి. ఇలా చేస్తే పాపం పరిహారమై పోయి... తొందరలోనే వివాహాం కుదురుతుంది.
శనివారం రోజునచెప్పులు కొనడం, నల్లని వస్తువులను ఇంటికి తేవడం చేయకూడదు. ఉప్పు,నూనెలు, ఇనుము వస్తువులను ఈరోజున కొనకూడదు. అంతేకాకుండా.. శనిదేవుడి అనుగ్రహాం కోసం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన కూడా మంచి ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)