Sreeleela: మైమరిపిస్తున్న శ్రీలీల అందాలు…ఆకట్టుకుంటున్న కొత్త ఫోటోలు..

Fri, 08 Mar 2024-2:21 pm,

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత రవితేజ ధమాకా చిత్రంలో కనిపించి మంచి విజయం సాధించింది.  

అప్పట్లో రవితేజ చిత్రం ధమాకా అంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం శ్రీలీల అందం.. డాన్స్ అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. అలా రెండో సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్.

ఆ తర్వాత నుంచి శ్రీలీలకి తెలుగు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా పోస్టర్స్ లో శ్రీలీల ఫోటో కంపల్సరీ అన్నట్టు మారింది ఆమె కెరియర్.

ఒకేసారి దాదాపు తొమ్మిది చిత్రాలు సైన్ చేసి సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. అయితే శ్రీలీల చేసిన అన్ని సినిమాలలో కన్నా బాలకృష్ణ భగవంత్ కేసరి ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం మరో రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో శ్రీలీల ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉన్నాయి. సినిమాల్లో అయినా ఇంస్టాగ్రామ్ లో అయినా శ్రీలీల టాప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link